twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరక్టర్ కావాలంటే ..వర్మ అవకాశం!!

    By Staff
    |

    రామ్ గోపాల్ వర్మ ఔత్సాహిక దర్శకులకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆయన తన అజ్ఞాత్ (తెలుగులో అడవి)సినిమా ప్రమేషన్ లో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను ప్రమోట్ చేస్తున్నారు. యు.టివి వారితో కలిపి రూపొందించిన ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలంటే మీరు చేయవల్సిందల్లా కేవలం ఓ షార్ట్ ఫిల్మ్ ని రూపొందించటమే. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ భయపెట్టాలి లేష్ షాక్ కు గురిచెయ్యాలి లేదా ఆశ్చర్యపరచాలి. మీరు అలా చేయగలిగితే మీరు వర్మ బ్రేక్ ఇస్తానంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నేను ఓ వ్యక్తి సినిమా డైరక్టర్ అవ్వాలంటే అసెస్టెంట్ డైరక్టర్ గా కెరీర్ ప్రారంభించనవసరం లేదని నమ్ముతాను కాబట్టి అంటున్నారు. ఓ కథ చెప్పాలన్న విపరీతమైన ఆసక్తి, ఆ కథపై స్పష్టత, మీరు నటులుకి చెప్పి చేయించుకోవటం, టెక్నీషియన్స్ కి మీకు షాటులో ఏం కావాలో చెప్పటం తెలిస్తే చాలు డైరక్టర్ కి అని నమ్ముతాను. అందుకే ఫిల్మ్ కి సంభందించి ఏ ట్రైనింగ్ తీసుకోని వారు, సినీ పరిశ్రమతో సంభందం లేనివారే ఈ కాంటెస్ట్ లో పాల్గొవాలి అనే కండిషన్ పెడుతున్నాను.

    దీనిపేరు: అజ్ఞాత్ కాంటెస్ట్

    షార్ట్ ఫిల్మ్ నిడివి: పది సెకెండ్ల నుంచి రెండు నిముషాల దాకా ఎంతైనా ఉండవచ్చు.
    బహుమతి: ఏదైతే ఫిల్మ్ నాకు(రాము)కి,యు.టివి వారికి నచ్చుతుందో వారికి మేము నిర్మాతలుగా దర్శకత్వం ఆఫర్ ఇస్తాం.
    కాబట్టి మీకు ధ్రిల్లర్ తీయాలనే కోరిక ఉంటే మంచి ఆఫర్ ఇది. అలాగే ప్రత్యేకంగా చెప్తున్నాను..ఈ మీరు తీసే ధ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ కి కథ అవసరం లేదు.అంతేగాదు ఓ మొదలు,చివర అనే స్క్రిప్టు రూల్స్ లేవు..ఓ మూమెంట్ ని ధ్రిల్ చేసేలా తీస్తే చాలు. ఓ చిన్న షాట్ లో సరిపోతుంది. అయితే మొదటే చెప్పుకున్నట్లు షాక్ కొట్టడమో,ఆశ్చర్యపరచటమో,ఏదైనా ఎమోషన్ ని మాత్రం కలిగించాలి. అంతే గాక అది మీ ఫిల్మ్ అయ్యుండాలి.
    ఎలా పంపాలి: మీరు తయారు చేసిన షార్ట్ ఫిల్మ్ ని [email protected]కి మెయిల్ చేయండి.
    లేదా మీ సీడీ లేదా డీవీడిని
    Aasif Ahmed, UTV Motion Pictures, 1181-82, Solitare Corporate, Guru Hargovindji Marg, Chakala, Andheir E, Mumbai-400 093

    ఎడ్రస్ కి పంపండి
    చివరి రోజు: అజ్ఞాత్ రిలీజ్ రోజు జూలై 17,2009 లోపు పంపించాలి. మేము మీ ఎడ్రస్ కి ఏ విషయం సమాచారం తెలియ చేస్తాం ఇక మీ కెమేరాలు ఆన్ చేయండి..బెస్ట్ ఆఫ్ లక్ .

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X