'భీమ్లా నాయక్'లో పవన్ కల్యాణ్ నడిపిన బండి కావాలా? అయితే ఏం చేయాలో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ హల్క్ రానా కలిసి నటించిన "భీమ్లా నాయక్" మంచి వసూళ్లు సాధించింది కూడా. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైన క్రమంలో సినిమాను విడుదల చేస్తున్న ఆహా ఓటీటీ బంపర్ ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే

కలెక్షన్ల సునామీ

కలెక్షన్ల సునామీ

డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్‏తోపాటు.. రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటించిగా.. నిత్యామీనన్.. సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మలయాళం సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్‏గా తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

స్ట్రీమింగ్ తేదీలో మార్పు

స్ట్రీమింగ్ తేదీలో మార్పు

త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్.. పవర్ స్టార్ యాక్షన్ సీన్లకు తోడు థమన్ మ్యూజిక్ కారణంగా ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా సహా డిస్నీ+హాట్ స్టార్ లో మార్చి 25న స్ట్రీమింగ్ అవ్వాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీలో మార్పు జరిగింది.

మార్చి 24

ఇందుకు ఒక్కరోజు ముందుగానే అంటే మార్చి 24న ఆహా సహా డిస్నీ+హాట్ స్టార్ లోభీమ్లా నాయక్ రచ్చ చేయనున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్ బండి

కానీ అదే రోజున జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతుండడంతో ఒక్కరోజు ముందుగానే మార్చి 24 న స్ట్రీమింగ్ అవుతున్నట్టు ఆహా సహా డిస్నీ+హాట్ స్టార్ ప్రకటించింది. ఇక దీంతో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది ఆహా సంస్థ. 'భీమ్లా నాయక్' సినిమాలో పవన్ కల్యాణ్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్ బండి నడిపారు కదా! ఆ బండి మీ సొంతం చేసుకోవాలని అనుకుంటే, ఆ అవకాశాన్ని మీకు అందిస్తోంది ఆహా వీడియో ఓటీటీ.

ఏం చేయాలంటే

ఏం చేయాలంటే

బండి మీకు కావాలంటే... మీరు ఒక పని చేయాలి. ఏప్రిల్ 1లోపు ఆహా వీడియోను స‌బ్‌స్రైబ్‌ చేసుకోవాలి. అలా స‌బ్‌స్రైబ్‌ చేసుకున్న వాళ్ళలో ఒకరికి బైక్ దక్కుతుంది. బైక్ ఎవరి సొంతం అవుతుందో? వెయిట్ అండ్ సీ అంటూ ఆహా ఒక ప్రకటనలో పేర్కొంది. 'భీమ్లా నాయక్'లో పవన్ కల్యాణ్ రెండు బైక్స్ నడిపారు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఒక బైక్ ఉంటే... పోలీస్ గా మరొక బైక్ నడిపారు. అందులో ఒక బండిని ప్రేక్షకులకు ఇవ్వాలని ఆహా నిర్ణయించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X