»   » హేమామాలిని కూతురు పెళ్లి వేడుకలో శ్రీదేవి, ఐశ్వర్యరాయ్, కాజోల్

హేమామాలిని కూతురు పెళ్లి వేడుకలో శ్రీదేవి, ఐశ్వర్యరాయ్, కాజోల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్స్ హేమా మాలిని, ధర్మేంద్రల చిన్న కూతురు అహానా డియోల్ ఎంగేజ్మెంట్ ఢిల్లీకి చెందిన బిజినెస్ మేన్ వైభవ్ వోరాతో గతేడాది జూన్ నెలలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి వివాహం ఫిబ్రవరి 2న ముంబైలో రంగరంగ వైభవంగా జరిగింది.

గత సంవత్సరం ఆమె సోదరి ఇషా డియోల్ వివాహం భరత్ తక్తాని అనే బిజినెస్ మేన్‌తో జరిగిన సంగతి తెలిసిందే. అహనా డియోల్, వైభవ్ వోరా ఇషా-భరత్ పెళ్లి సందర్బంగా పరిచయం అయ్యారు. అహానా-వైభవ్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇద్దరినీ ఏకం చేసారు.

వీరి వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. షారుక్ కాన్, రేఖ, దీపిక పదుకోన్, కాజోల్, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ తదితరులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

అహనా డియోల్, వైభవ్ వోరా...

అహనా డియోల్, వైభవ్ వోరా...


తమ వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా అహనా డియోల్, వైభవ్ వోరా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ముంబైలో ఈ కార్యక్రమం జరిగింది.

బచ్చన్ ఫ్యామిలీ...

బచ్చన్ ఫ్యామిలీ...


అహనా డియోల్, వైభవ్ వోరా వివాహానికి హాజరైన బచ్చన్ ఫ్యామిలీ. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ అంతా కలిసే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్


అహనా డియోల్, వైభవ్ వోరా వివాహానికి హాజరైన హీరోయిన్ పదుకోన్ జేడ్ కలర్డ్ సారీలో ఆకట్టుకుంది.

అహనా డియోల్, ధర్మేంద్ర

అహనా డియోల్, ధర్మేంద్ర


తండ్రి ధర్మేంద్రతో కలిసి ఫోటోలకు ఫోజు ఇచ్చి అహనా డియోల్. తన పిల్లలందరిలోకెల్లా అహనా డియోల్ తనకెంతో ఫేవరెట్ అని ధర్మేంద్ర చెప్పుకొచ్చారు.

సిస్టర్, మదర్‌తో కలిసి హాజరైన కాజోల్

సిస్టర్, మదర్‌తో కలిసి హాజరైన కాజోల్


హీరోయిన్ కాజోల్ తల్లి తనుజా, సోదరి తానిషాతో కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో కాజోల్ డ్రెస్సింగ్ ఆకట్టుకుంది.

మాధురి, శ్రీదేవి, కాజోల్

మాధురి, శ్రీదేవి, కాజోల్


బాలీవుడ్ మాజీ స్టార్ హీరోయిన్లయిన మాధురి దీక్షిత్, శ్రీదేవి కపూర్, కాజోల్ .....అహనా డియోల్ పెళ్లి వేడుకకు హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

భర్తతో ఇషా డియోల్

భర్తతో ఇషా డియోల్


సోదరి అహనా డియోల్ వివాహ వేడుకలో భర్త భరత్ తక్తానీతో కలిసి ఇషా డియోల్.

English summary
Ahana Deol, daughter of Hema Malini and Dharmendra and younger sister of Esha Deol tied the knot with businessman Vaibhav Vora in a grand ceremony on Sunday, February 2nd in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu