»   »  ‘కబాలి’: హైదరాబాద్లో 300 మంది 200 గంటలు కష్టపడ్డారు (వీడియో)

‘కబాలి’: హైదరాబాద్లో 300 మంది 200 గంటలు కష్టపడ్డారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విమానాలపై కబాలి పోస్టర్లు వేసి సరికొత్త ట్రెండుకు నాంది పలికారు 'కబాలి' మూవీ మేకర్స్. ఏయిర్ ఏషియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలు కబాలి పోస్టర్లతో ఓ విమానాన్ని రెడీ చేయించడం ద్వారా ఇండియన్ సినీ వరల్డ్ దృష్టిని ఆకర్షించారు. ఇండియన్ సినీ చరిత్రలో ఇలా చేయడం ఇదే తొలి సారి కావడంతో ఇదో హాట్ టాపిక్ అయింది.

ఇండియాలో ఇదే ఫస్ట్, రజనీకే సాధ్యం:'కబాలి' మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్...


ఎయిర్ ఏషియా విమానానికి 'కబాలి' పోస్టర్లు అంటించే కార్యక్రమం హైదరాబాద్ లోనే జరుగడం విశేషం. హైదరాబాద్ లోని ఎయిర్ పోర్టులో దాదాపు 300 మంది టెక్నీషియన్లు 200 గంటల పాటు అంకిత భావంతో శ్రమించి కబాలి ఎయిర్ ఏషియా విమానాన్ని సిద్దం చేసారు.తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను 'ఎయిర్ ఏషియా కబాలి- ది మేకింగ్ ఆఫ్ ది కబాలి లైవెరీ' పేరిట రిలీజ్ చేసారు. విమానాలకు ఎలా పేయింటింగ్ వేస్తారో కూడా మనం ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు.


ప్రస్తుతం ఇంటర్నెట్లో కబాలి ఫీవర్ ఓ రేంజిలో ఉండటంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ లా షేర్ అవుతోంది. వీడియో కూడా చూడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరూ ఓ లుక్కేయండి మరి.


సోమవారం సెన్సార్‌ ముందుకెళ్లిన ఈ సినిమా 'యు'సర్టిఫికేట్ పొందింది. ఈ నెల 22న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ చిత్రంలో రజనీ "కుతు" అనే తమిళ సంప్రదాయ నృత్యం చేసే సన్నివేశం ఉందట. రజనీ స్టెప్పులు అభిమానులను అలరిస్తాయని అంటున్నారు. 'కబాలి' చిత్రీకరణ ఎక్కువ భాగం మలేసియాలో జరిగింది.

English summary
Watch the never seen before footage, of the KABALI livery making! A massive tribute to Superstar Rajinikanth from the AirAsia Allstars family. One Man, One Airline.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu