»   » ఫ్రెంచి ప్రెసిడెంట్ విందులో ఐశ్వర్య రాయ్ లుక్ అదిరింది (ఫోటో)

ఫ్రెంచి ప్రెసిడెంట్ విందులో ఐశ్వర్య రాయ్ లుక్ అదిరింది (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారత దేశ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండేకు రిపబ్లిక్ డే సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ఫ్రాన్సు రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ విందులో ఆయన గౌరవార్థం పలువురు ప్రముఖులనూ పిలిచి భారీ విందు ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మాజీ మిస్ వరల్డ్ - బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కు కూడా ఆహ్వానం అందటం విశేషం. హోలాండే కోసం ఇస్తున్న ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ ఫ్రాన్స్ దౌత్య వేత్త ఫ్రాంకోయిస్ రీచర్ ఐశ్వర్య రాయ్ ను స్వయంగా కోరారు. ఫ్రాన్స్ లో జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఐశ్వర్య ప్రచారకర్తగా ఉంది. ఆమెకు మాత్రమే ఆహ్వానం అందడానికి అది కూడా ఓ కారణం అయి ఉండొచ్చని అంటున్నారు.

Also Read: ఐశ్వర్యరాయ్, రణబీర్ మధ్య ముద్దు సీన్ ఉంది కానీ, తీసేసారు!

Aish looks hot in red sari for Hollande lunch

ఇక మంగళవారం జరిగిన ఈ విందుకు హాజరైన ఐశ్వర్యరాయ్ అందరినీ ఆకర్షించింది. సాంప్రదాయ చీకట్టులో ఐష్ మరింత అందంగా మెరిసిపోయింది. ఆమె ధరించిన ఎరుపురంగు బనారస్ పట్టు చీర, ఆభరణాలు భారతీయ కట్టుబొట్టుకు అద్దపట్టేలా ఉండటం విశేషం. తన కుమార్తె ఆరాధ్యతో కలిసి ఈ విందుకు హాజరయ్యారు.

ఈ విందుకు హాజరైన ఐశ్వర్యరాయ్ ని ఫ్యాన్స్ అధ్యక్షుడు హోలాండే స్వయంగా అభివాదం చేసి లోనికి తీసుకెళ్లడం విశేషం. ఐశ్వర్యరాయ్ బ్యూటిఫుల్ లుక్ కు సంబంధించిన ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Actress Aishwarya Rai Bachchan has chosen an elegant look in a red designer Banarasi silk sari to wear for a special lunch with French President Francois Hollande here on Tuesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu