»   » మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ ఫ్యామిలీ! (ఫోటోస్)

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ ఫ్యామిలీ! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. అమితాబ్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య అంతా కలిసి ఈ తీర ప్రాంతంలో జాలీగా గడిపేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని అమితాబ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు వెల్లడించారు.

నేడు అభిషేక్ బచ్చన్ బర్త్ డే. నేటి(ఫిబ్రవరి 05)తో అభిషేక్ 40వ పడిలోకి అడుగుపెడుతున్నాడని అమితాబ్ ట్వీట్ చేశారు. అభిషేక్ బర్త్ డే సందర్భంగా మాల్దీవుల్లో గడిపేందుకు, అక్కడే ఎంజాయ్ చేసేందకు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లారు. ఫ్యామిలీ అంతా కలిసి ఒక షిప్ ప్రయాణిస్తున్న ఫొటోతో పాటు ‘హ్యాపి బర్త్ డే' అంటూ రాసి ఉన్న మరో ఫొటోను కూడా అమితాబ్ పోస్ట్ చేశారు.

ఫిబ్రవరి 5, 1976న అభిషేక్ బచ్చన్ జన్మించాడు. J.P.దత్తా దర్శకత్వంలో వచ్చిన రేఫ్యుజీ (2000) చిత్రం ద్వారా అభిషేక్ బచ్చన్ తెరంగ్రేటం చేసాడు. 2004లో వచ్చిన ధూమ్ సినిమాతో తొలి కమర్షియల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 2007లో ఐశ్వర్యరాయ్ ని పెళ్లాడిన అభిషేక్....ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ సాగిస్తున్నారు.

స్లైడ్ షోలో బచ్చన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్...

మాల్దీవుల్లో..

మాల్దీవుల్లో..


బచ్చన్ ఫ్యామిలీ అంతా కలిసి మాల్దీవుల్లో బోటు షికారు చేస్తున్న దృశ్యం.

హ్యాపీ బర్త్ డే

హ్యాపీ బర్త్ డే


మాల్దీవుల్లో ఫైర్ తో డిఫరెంటుగా హ్యాపీ బర్త్ డే చెప్పారు.

ఫ్యామిలీ

ఫ్యామిలీ


2007లో ఐశ్వర్యరాయ్ ని పెళ్లాడిన అభిషేక్....ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ సాగిస్తున్నారు.

చూడముచ్చటైన జంట

చూడముచ్చటైన జంట


ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు.

English summary
We told you recently that Abhishek Bachchan will celebrate his birthday in Maldives. Now, we have a got a cute picture of Aishwarya Rai Bachchan, Aaradhya Bachchan, Abhishek Bachchan, Amitabh Bachchan, Jaya Bachchan and Shweta Bachchan enjoying the boat ride in Maldives.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu