»   » మెగాస్టార్ ఇంట్లో దీపావళి సంబరాలు-సినీస్టార్స్ సందడి (ఫోటోస్)

మెగాస్టార్ ఇంట్లో దీపావళి సంబరాలు-సినీస్టార్స్ సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో ప్రతి సంవత్సరం జరిగినట్లే ఈ సారి కూడా గ్రాండ్ గా దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ తారలు శిల్పా శెట్టి, హృతిక్ రోషన్, సోనాక్షి, ప్రీతి జింతా, టబు, సిని అగర్వాల్, మనీష్ మల్హోత్రా తదితరులు హాజరై సందడి చేసారు. ఈ వేడుకలో బిగ్ బి కోడలు ఐశ్వర్యరాయ్ సాంప్రదాయ దుస్తుల్లో స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంది.

కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యే దిల్ హై ముష్కిల్' షూటింగులో భాగంగా లండన్ లో ఉన్న ఐశ్వర్యరాయ్ ప్రత్యేకంగా దీపావళి సెలబ్రేషన్స్ కోసం ఇండియా తిరిగి వచ్చారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో ఆనందంగా వేడుకలో పాల్గొన్నారు.

దీపావళి సెలబ్రేషన్స్ సందర్భంగా ఐశ్వర్యరాయ్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ...‘మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా దీపావళి వేడుక జరుగుతుంది. ఈ సమయంలో అంతా ఎక్కడున్న తప్పుకుండా ఈ వేడుకలకు హాజరవుతాం' అని వెల్లడించారు.

ఇంకా మాట్లాడుతూ...‘మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎవరి షెడ్యూల్స్ లో వారు తలమునకలై ఉన్నాం. దీపావళి అంటే మాత్రం తప్పకుండా రావడానికి మాగ్జిమమ్ ట్రై చేసాం. ఒక్కోసారి రావడానికి సాధ్యం కాకపోవచ్చు. బట్ వి ట్రై అవర్ బెస్ట్' అని చెప్పుకొచ్చారు.

బచ్చన్ ఫ్యామిలీలో దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఏర్పాట్లన్నీ జయా బచ్చన్ దగ్గరుండి చూసుకుంటారు. అలంకరణ దగ్గర నుండి అతిథుల కోసం స్పెషల్ మెను వరకు ఆమె అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు. గతంలో బచ్చన్ ఫ్యామిలీలో జరిగే దీపావళి వేడుకల్లో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, దీపిక పదుకోన్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్ తదితరులు కూడా కనిపించేవారు. సచిన్ టెండూల్కర్ సైతం హాజరయ్యేవారు. అయితే ఈ సారి మాత్రం స్టార్స్ తక్కువగానే కనిపించారు.

సెలబ్రిటీలు

సెలబ్రిటీలు


బచ్చన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలో ప్రీతి జింతా, మనీష్ మల్హోత్రా, ఐశ్వర్యరాయ్ బచ్చన్, శిల్ప శెట్టి, హృతిక్ రోషన్, సోనాక్షి సిన్హా తదితరులు.

దీపావళి బాష్

దీపావళి బాష్


అమితాబ్ తో కలిసి టబు, అబు జాని, అమృత తదితరులు...

నిష్కా-ఐష్-నీతా

నిష్కా-ఐష్-నీతా


ఐశ్వర్యరాయ్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నీతాలుల్లా, ఆమె కూతురు నిష్కా లుల్లా.

సిమి-ఐష్

సిమి-ఐష్


నటి సిమి అగర్వాల్ తో కలిసి ఐశ్వర్యరాయ్.

డిజె అఖీల్-ఐష్-ఫరా

డిజె అఖీల్-ఐష్-ఫరా


డిజె అఖీల్, పరా ఖాన్ తో కలిసి ఐశ్వర్యరాయ్.

అభిషేక్-అఖిల్

అభిషేక్-అఖిల్


డిజె అఖిల్ తో కలిసి అభిషేక్ బచ్చన్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

బిగ్ బి పార్టీ

బిగ్ బి పార్టీ


రాహుల్ ఖన్నా, ప్రీతి జింతా, ఫరా ఖాన్ తదితరులు అమితాబ్ బచ్చన్ దివాళి బాష్ లో...

అమితాబ్ బచ్చన్ దివాళి పార్టీ

అమితాబ్ బచ్చన్ దివాళి పార్టీ


ప్రతి సంవత్సరం బచ్చన్ ఫ్యామిలీ గ్రాండ్ గా దివాళి సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు.

అమితాబ్-రోహిత్

అమితాబ్-రోహిత్


దివాళి పార్టీలో రోమిత్ రాయ్ తో కలిసి అమితాబ్ బచ్చన్.

బాలీవుడ్ సెలబ్రిటీస్

బాలీవుడ్ సెలబ్రిటీస్


ఈ దివాళి పార్టీకి హాజరైన అతిథులంతా ఎంతో ఉత్సాహంగా గడిపారు.

English summary
Just like every year, this year too Amitabh Bachchan organised a grand Diwali party at his house and Bollywood celebrities like Shilpa Shetty, Hrithik Roshan, Sonakshi Sinha,Preity Zinta, Tabu, Simi Garewal and Manish Malhotra graced the party with their precence.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu