Just In
- 7 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 8 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్సింగ్స్: ‘జజ్బా’ షూటింగ్ షురూ
హైదరాబాద్: బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుండి ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె మళ్లీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందో? అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఆమె ఆ దర్శకుడితో చేస్తుందా? ఈ నిర్మాణ సంస్థలో చేస్తుందా? అంటూ గత కొంతకాలంగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే ఎట్టకేలకు ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభమైంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆమె బాలీవుడ్ మూవీ ‘జబ్బా' సినిమాలో నటిస్తోంది. యాక్షన్, థ్రిలర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ సంజయ్ గుప్తా ట్వీట్ చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సినిమా కోసం ఐశ్వర్యరాయ్ గత కొంతకాలంగా సన్నద్ధం అవుతోంది. సినిమాలో తాను చేయబోయే పాత్రకు తగిన విధంగా శరీరాకృతిని మలుచుకుంది. ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత ఐశ్వర్యరాయ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మి, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ ప్రై.లి. వైట్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.