»   » పద్మావతి కోసం 20 రోజుల పాటు... ఐష్ నే ముందు అప్రోచ్ అయ్యిందట

పద్మావతి కోసం 20 రోజుల పాటు... ఐష్ నే ముందు అప్రోచ్ అయ్యిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

షారుఖ్ ఖాన్ దేవదాస్ సినిమాలో డోలారే డోలారే సాంగ్ ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. హాట్ గాళ్స్ అయిన ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్ ఇద్దరు ముద్దుగుమ్మలు ఆడి పాడిన ఆ సాంగ్ సినిమాకే హైలెట్ అయ్యింది. అప్పట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఈ పాటలేకుండా పూర్తయ్యేదే కాదు. అంతలా పాపులర్ అయ్యింది ఈ పాట, ఆ తర్వాత అదే స్థాయిలో ప్రియాంకా చోప్రా, దీపికా లతో బాజీరావు మస్తానీ లో మరోసరి మెరుపులు మెరిపించాడు సంజయ్ లీలా బన్సాలీ, యావత్ భారత దేశ సినిమా అభిమానులకు కన్నుల విందుగా బాజీరావు మస్తానీ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి.

ఆ చిత్రంలో దీపికా పదుకొనె ప్రధాన కథానాయిక అయినప్పటికీ రాజ దర్బార్ లో దీపికా నృత్యకారునిగా మస్తానీ మస్తానీ పాటకి చేసిన నృత్యం అందరిని కట్టిపడేసింది. ఆ పాటకి ఇంతటి గుర్తింపు దక్కటానికి బన్సాలి ఎంచుకున్న కోరియోగ్రఫీ తో పాటు వేసిన సెట్, లైటింగ్ ఎఫెక్ట్, సంగీతం, కథలోని సన్నివేశం అన్నీ ఆ పాటను అంతలా బల పరిచాయి. సంజయ్ లీలా బన్సాలి ప్రస్తుతం పద్మావతి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వరుసగా మూడవ సారి దీపికా పదుకొనె బన్సాలి చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. అయితే ఇప్పుడు అదనపు అకర్శణ తోడుకానుంది... ఒక ప్రత్యేక గీతం లో ఐష్ మరో సారి డోలారే మ్యాజిక్ ని రిపీట్ చేయనుంది.

త్యేక గీతం:

త్యేక గీతం:


దీపికా పదుకొనె టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మెరవటానికి మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఉవ్విళ్ళూరుతున్నట్టు సమాచారం. తనంతట తానే పద్మావతిలో ప్రత్యేక గీతం చేస్తానని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ని సంప్రదించింది అంట ఐష్. ఈ ఒక్క పాట రిహార్సల్స్, షూటింగ్‌.. అన్నిటికీ భన్సాలీ 20 రోజుల కాల్షీట్స్‌ అడిగారని సమాచారం.

 భారతీయ తెరపై చూడని రీతిలో:

భారతీయ తెరపై చూడని రీతిలో:


ఈ దర్శకుడు తన సినిమాల్లో పాటలన్నిటినీ భారీగానే చిత్రీకరిస్తారు. ‘దేవదాస్‌'లోని ‘డోలారే డోలారే..' అయినా, తాజా ‘బాజీరావ్‌ మస్తానీ'లో ‘పింగా గ పోరి పింగా..' అయినా కన్నుల పండువగా ఉంటాయి. ఇప్పుడీ ‘పద్మావతి' లోనూ ఐశ్వర్యారాయ్‌ ప్రత్యేక గీతం భారీ స్థాయిలో ఉంటుందట. ‘మునుపెన్న డూ భారతీయ తెరపై చూడని రీతిలో భన్సాలీ ఈ పాటను తీయను న్నారు' అని చిత్ర బృందం పేర్కొంది.

 ఐశ్వర్యకు మంచి పేరు తెచ్చేలా:

ఐశ్వర్యకు మంచి పేరు తెచ్చేలా:


గతంలో భన్సాలీ దర్శకత్వం వహించిన ‘దేవదాస్‌', ‘గుజారిష్‌' చిత్రాలలానే ఈ ‘పద్మావతి' కూడా ఐశ్వర్యకు మంచి పేరు తెచ్చేలా ఉంది.గతంలో హమ్ దిల్ దే చుకే సోనమ్, దేవదాస్, గుజారిష్ చిత్రాలతో బన్సాలీతో వున్న చనువుతో ఐష్ పద్మావతిలో తన నృత్య ప్రదర్శనకి ఏర్పాట్లు చేసుకుంటుంది.

 2017 నవంబర్ 11 న :

2017 నవంబర్ 11 న :


గతంలో ఐష్ చేసిన కజరారే కజరారే పాట, దేవదాస్ లో చేసిన డోలారే ఎంత సంచలనం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ పాట తరువాత ఐష్ నృత్యించబోయే ప్రత్యేక గీతం పద్మావతి చిత్రం లోనే కావటం విశేషం. 2017 నవంబర్ 11 న పద్మావతి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 మరో చారిత్రాత్మక కథ:

మరో చారిత్రాత్మక కథ:


హృద్యమైన ప్రేమకథలను తెరతెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీ సిద్ధహస్తుడు. ఆయన దృశ్యకావ్యాలు సినీ ప్రియులనే కాక విమర్శకులనూ కట్టిపడేస్తాయి. 'బాజీరావ్ మస్తానీ'తో భారీ హిట్ అందుకున్న భన్సాలీ మరో చారిత్రాత్మక కథను తెరకెక్కించనున్నారు. 12, 13శతాబ్దాలకు చెందిన రాణి పద్మావతి గాథ ఇది. సినిమా పేరు కూడా 'పద్మావతి'గానే నిర్ణయించారు.

 రక్తపాతమే కథాంశంగా:

రక్తపాతమే కథాంశంగా:


వివాహితురాలై పద్మావతిని అల్లాఉద్దీన్ ఖిల్జీ మోహించడం.. ఆమె కోసం అతడు సృష్టించిన రక్తపాతం కథాంశంగా ఈ సినిమా రూపొందనుంది. చారిత్రాత్మక కథ...అందులోనూ భన్సాలీ డీల్ చేస్తున్న సబ్జెక్ట్‌ కాబట్టి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకప్పడు ప్రేమికులు, ఇప్పుడు దూరం దూరంగా ఉంటున్న రణవీర్‌సింగ్‌, దీపికా పదుకొనే కలిసి పనిచేస్తున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ 'పద్మావతి' సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

 సందేహాలు:

సందేహాలు:


అయితే ఇదే చిత్రంలో నటిస్తున్న షాహిద్‌కపూర్‌తో దీపిక సన్నిహితంగా మసులుతుండటం రణవీర్‌కు మింగుడుపడటం లేదట. ఈ నేపథ్యంలో సినిమాలో దీపికా, రణ్‌వీర్‌ మధ్య కెమిస్ట్రీ ఎలా పండుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలో రణ్‌వీర్‌, దీపిక కలిసి పంచుకునే సీన్‌ ఒక్కటి కూడా ఉండదట. అందుకే 'పద్మావతి' షూటింగ్‌ కోసం లొకేషన్లు వెతికే పనిలో బిజీగా ఉన్నాడు భన్సాలీ.

 ఖిల్జీగా రణవీర్‌, రతన్‌సింగ్‌గా షాహిద్‌:

ఖిల్జీగా రణవీర్‌, రతన్‌సింగ్‌గా షాహిద్‌:


ఇందులో చిత్తోర్‌ (రాజస్థాన్) రాజు రావల్‌ రతనసింగ్‌ భార్య పద్మావతి సౌందర్యం గురించి విని, ఎలాగైనా ఆమెను తన స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ సుల్తాన అల్లావుద్దీన ఖిల్జీ తపిస్తుంటాడు. అతడు తమ రాజ్యంపైకి దండెత్తివచ్చినప్పుడు పద్మావతి ఏం చేసిందనేది సినిమా ప్రధానాంశం. ఖిల్జీగా రణవీర్‌, రతన్‌సింగ్‌గా షాహిద్‌, అతని భార్య పద్మావతిగా దీపిక నటించనున్నారు.

 అత్యంత భారీగా :

అత్యంత భారీగా :


బాహుబలిని మించిన స్థాయిలో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ! రొమాంటిక్ లవ్ స్టోరీని అత్యంత భారీగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు భన్సాలీ. గత చిత్రం ‘బాజీరావ్ మస్తానీ' దేశవ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఎన్నో అవార్డులూ రివార్డు కూడా అందుకుంది. అయితే ఈ చిత్రంలో భారీ వార్ సీక్వెన్సులు లాంటివి లేవు. ఆ కథ వేరు.

 భారీ యుద్ధ సన్నివేశాలు:

భారీ యుద్ధ సన్నివేశాలు:


బాజీరావ్ మస్తానీ తరువాత అంతకంటే మరో భారీ చిత్రం ‘రాణి పద్మావతి'ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ చిత్రం కూడా సున్నితమైన ప్రేమకథాంశం చుట్టూ అల్లుకున్నదే అని తెలుస్తోంది. అయితే ఇందులో భారీ యుద్ధ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

English summary
Aishwarya Rai Bachchan is all set to give a special appearance in a song in Sanjay Leela Bhansali’s upcoming film ‘Padmavati’. The reports revealed that she will be seen in a song. The shooting of the song was done for 15 to 20 days in a suburban studio.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu