twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బొమ్మను కాదు, చైతన్యం రగిలిస్తా: ఐశ్వర్య రాయ్

    By Bojja Kumar
    |

    ముంబై: అందాల తార ఐశ్వర్య రాయ్ ఐక్యరాజ్య సమితి ఎయిడ్స్ విభాగం(UNAIDS)గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. పసిపిల్లలకు ఎయిడ్స్ సోకకుండా, హెచ్‌ఐవి వైరస్‌తో బాధ పడే వారు క్రమం తప్పకుండా యాంటీ రైట్రో వైరల్ మందులు వాడేలా చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమంలో ఆమె పాలుపంచుకోనున్నారు.

    ఈ అవేర్‌నెస్ ఫ్రోగ్రాంలో ఐశ్వర్య రాయ్ కేవలం పోస్టర్ గర్ల్‌గానే మిగిలి పోకుండా మరింత ముందుకు అడుగు వేయాలని యోచిస్తోంది. ఈ కార్యక్రమాల్లో స్వయంగా పాలు పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ...ఐక్యరాజ్యసమితితో కలిసి పని చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా ఐశ్వర్య పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో తాను కేవలం పోస్టర్లకు మాత్రమే పరిమితమైన బొమ్మలా నామ మాత్రంగా కాకుండా, ఎయిడ్స్ సమస్యలపై సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను పోగొట్టడంలో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తానని వెల్లడించారు. ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని ఐశ్వర్యరాయ్ స్పష్టం చేసారు.

    ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యతో కలిసి చికాగోలో ఉంది. అభిషేక్ బచ్చన్ ధూమ్-3 చిత్రీకరణలో భాగంగా కొన్ని రోజులుగా అమెరికాలోని చికాగోలో మకాం వేయాల్సి వచ్చింది. దీంతో అక్కడే అద్దె ఇల్లు తీసుకుని ఐశ్వర్యతో పాటు కూతురు ఆరాధనను తీసుకుని అక్కడికి షిప్ట్ అయ్యారు.

    English summary
    Beauty queen Aishwarya Rai Bachchan, who has been appointed as the International Goodwill Ambassador for UNAIDS, will raise global awareness on protecting children from HIV infection and increasing access to antiretroviral treatment. But, as for Ash, she won't just be a mere poster girl for the organization.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X