»   » కరీనా కారణంగా అప్‌సెట్ అయిన ఐశ్వర్య రాయ్

కరీనా కారణంగా అప్‌సెట్ అయిన ఐశ్వర్య రాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కరీనా అక్క కరిష్మా కపూర్, అభిషేక్ బచ్చన్ గతంలో పెళ్లి చేసుకోవాలని చూశారు. వ్యవహారం ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లింది. ఏమైందో కానీ...పెళ్లి జరుగకముందే వీళ్ల బంధం పెటాకులయింది. ఆ తర్వాత అభిషేక్ ఐశ్వర్యరాయ్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా గతం.

తాజా విషయానికొస్తే....మధుర్ బండార్కర్ రూపొందిస్తున్న 'హీరోయిన్" సినిమాలో ఐశ్వర్యరాయ్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. అయితే ఐశ్వర్య గర్భవతి కావడంతో సినిమా ఆగి పోయింది. దీంతో మధుర్ బండార్క్ మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఐశ్వర్యరాయ్ కూడా రియలైజ్ అయి సినిమా కోసం తాను తీసుకున్న అమౌంట్ ను తిరిగి ఇచ్చేసింది. అప్పటికే ఐశ్వర్యపై కొన్ని సీన్లు షూట్ చేశారు. అయితే వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడటానికి వీల్లేదని దర్శక నిర్మాతలకు తేల్చి చెప్పింది.

ప్రస్తుతం ఐశ్వర్య స్థానంలో కరీనా కపూర్ నటించబోతోంది. అయితే తన స్థానాన్ని కరీనా దక్కించుకోవడాన్ని ఐశ్వర్య జీర్ణించుకోలేక పోతోందట. కుటుంబ పరంగానే కాక, వ్యక్తిగతంగా కూడా ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. దీంతో తన స్థానంలో హీరోయిన్ చాన్స్ దక్కించుకుని, తనకంటే ఎక్కువ రెమ్యూనరేషన్(రూ. 8 కోట్లు) దక్కించుకుంటుందని ఐశ్వర్య మదన పడుతోందట.

ఈ సినిమాకు రూ. 8 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కరీనా......భారీ మొత్తం తీసుకుంటున్న తొలి ఇండియన్ హీరోయిన్ గా రికార్డుల కెక్కబోతోంది. ప్రస్తుతం ఆమె నెం.1 స్థానంలో కొనసాగుతోంది.

English summary
Bachchan bahu Aishwarya Rai is not very happy with the fact that Kareena has readily accepted Heroine, a project that was started with her; a film she had to let go off when she realized that she pregnant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu