»   »  హీరోయిన్లను అలా వాడుకోవడం లేదు, వల్గారిటీ అంటే ఒప్పుకోను: అజయ్ దేవగన్

హీరోయిన్లను అలా వాడుకోవడం లేదు, వల్గారిటీ అంటే ఒప్పుకోను: అజయ్ దేవగన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో హిందీ కామెడీ సిరీస్ 'గోల్ మాల్' నాలుగవ ఇన్‌స్టాల్మెంట్ త్వరలో విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. తమ సినిమాల్లో ఆడ, మగ యాక్టర్లకు సమానమైన ప్రాధాన్యం ఉంటుందని, క్లీన్ కామెడీతో 'గోల్ మాల్' కామెడీ సీక్వెల్స్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తున్నాయన్నారు.

కామెడీ అనేది కేవలం మేల్ డామినేటెడ్ మాత్రమే అంటే ఒప్పుకోను. మా సినిమాల్లో నలుగురు లేదా ఐదుగురు మేల్ హీరోలు ఉంటారు. వారి సరసన నటించే హీరోయిన్లకు కూడా వారితో సమానమైన మంచి రోల్స్ ఉంటాయన్నారు.

వల్గర్ జోక్స్ కోసం హీరోయిన్లను వాడుకోవడం లేదు

వల్గర్ జోక్స్ కోసం హీరోయిన్లను వాడుకోవడం లేదు

హీరోయిన్లను కేవలం హీరోలు వారిపై కామెడీ చేయడానికి, వల్గర్ జోక్స్ వేయడానికే ఉపయోగించుకుంటున్నామంటే నేను ఒప్పుకోను. తమ సినిమాల్లో అలాంటి అస్సలు ఉండవు అని అజయ్ దేవగన్ స్పష్టం చేశారు.

ఎప్పుడూ ఫ్యామిలీ ఎంటర్టెనర్స్ చేయడానికి ప్రయత్నిస్తాను

ఎప్పుడూ ఫ్యామిలీ ఎంటర్టెనర్స్ చేయడానికి ప్రయత్నిస్తాను

ఈ రోజుల్లో ఫ్యామిలీ ఎంటర్టెనర్లు చాలా తక్కువ రూపొందుతున్నాయి. నేను చేసే ప్రతి సినిమా దాదాపు ఫ్యామిలీ ఎంటర్టెనర్‌లా ఉండాలని, అందరూ కలిసి వెళ్లి సినిమా చూసే విధంగా ఉండాలని కోరుకుంటాను... అని అజయ్ అన్నారు.

పరిణీతి, టబు కొత్తగా గోల్ మాల్ ఫ్యామిలీలోకి

పరిణీతి, టబు కొత్తగా గోల్ మాల్ ఫ్యామిలీలోకి

త్వరలో వస్తున్న ‘గోల్ మాల్ ఎగైన్' సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు ఇంతకు ముందు ఈ సిరీస్ లో నటించిన అర్షద్ వర్సి, కునాల్ కేము, శ్రేయాస్ తల్పడె, తుషార్ కపూర్ నటిస్తున్నారు. ఈ సీరీస్‌లో తొలిసారి టబు, పరిణీతి చోప్రా నటిస్తున్నారు.

అజయ్‌కి నచ్చనిది ‘గోల్ మాల్-2’

అజయ్‌కి నచ్చనిది ‘గోల్ మాల్-2’

ఇప్పటి వరకు వచ్చిన గోల్ మాల్ సీక్వెల్స్‌లో మొదటి ‘గోల్ మాల్', మరియు ఇపుడు రాబోతున్న నాలుగవ ‘గోల్ మాల్' బాగా నచ్చింది. మూడోది ఓకే. కానీ గోల్ మాల్-2 మాత్రం అందరిలాగే తనకు అస్సలు నచ్చలేదని అజయ్ దేవగన్ తెలిపారు.

గోల్ మాల్ సినిమాలను ఇంతగా ఆదరిస్తారని అనుకోలేదు

గోల్ మాల్ సినిమాలను ఇంతగా ఆదరిస్తారని అనుకోలేదు

గోల్ మాల్ సినిమాలను ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తారని మేము ఎప్పుడూ ఊహించలేదు. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు, టీవీల్లో కూడా మంచి ఆదరణ లభించింది. అన్ని క్యారెక్టర్లు మెమొరబుల్. గోల్ మాల్ 4 తర్వాత గోల్ మాల్ 5 కూడా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నామని అజయ్ తెలిపారు.

English summary
Ajay Devgn, who is ready with the fourth installment in the Golmaal franchise, says their movie is a clean comedy that gives equal importance to both male and female actors. "Comedy is not male dominated space, the fact is very few clean comedies are being made. In our film, there are four- five male heroes but the actresses also have equally good roles."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu