»   » తెలుగు ఇండస్ట్రీపై కామెంట్స్: క్షమాపణ చెప్పిన నటుడు అజయ్ ఘోష్

తెలుగు ఇండస్ట్రీపై కామెంట్స్: క్షమాపణ చెప్పిన నటుడు అజయ్ ఘోష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమాలను, ఇండస్ట్రీని తాను కించపరచలేదని తెలుగునటుడు అజయ్ ఘోష్ అన్నారు. ఇటీవల ఓ తమిళ సినీ ఫంక్షన్లో తాను చేసిన కామెంట్లపై అజయ్ వివరణ ఇచ్చారు. దక్షిణాదికి మూలమైన తమిళ సినిమాను పొగిడానే తప్ప, తెలుగు సినిమాలను తాను కించపరచలేదని అన్నాడు. తాను ఎలాంటి వ్యక్తినో టాలీవుడ్ లో ఎంతో మందికి తెలుసని చెప్పాడు.

తాను కావాలని ఏదీ అనలేదని... సరాదాగా అన్నానని అజయ్ చెప్పాడు. తన వ్యాఖ్యలకు ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు అజయ్ ఘోష్ తెలిపారు. తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నోళ్లు కష్టపడ్డాను, అవమానాలు భరించాను అని అజయ్ తెలిపారు.

తమిళంలో చేసిన తర్వాతే అవకాశాలు పెరిగాయి

తమిళంలో చేసిన తర్వాతే అవకాశాలు పెరిగాయి

చిన్నచిన్న సినిమాల్లో చేస్తున్న సమయంలోనే దర్శకుడు వెట్రిమారన్ తమిళ సినిమాలో అవకాశం ఇచ్చారని తెలిపారు. వెట్రిమారన్ విసారనై సినిమా తర్వాత తనకు అవకాశాలు పెరిగాయని అజయ్ తెలిపారు. అంతకు ముందు తనకు సీరియల్సే తిండిపెట్టాయన్నారు.

తెలుగు ఇండస్ట్రీపై అజయ్ చేసిన కామెంట్స్ ఇవే

తెలుగు ఇండస్ట్రీపై అజయ్ చేసిన కామెంట్స్ ఇవే

తెలుగు ఇండస్ట్రీలో కెమెరా ముందు మాత్రమే కాదు... ఆఫర్ల కోసం కెమెరా వెనక కూడా నటించాలి. కానీ తమిళ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదు. తమిళ ఇండస్ట్రీ చాలా గ్రేట్ అంటూ అజయ్ ఘోష్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగులో బిల్డప్పులెక్కువ అంటూ

తెలుగులో బిల్డప్పులెక్కువ అంటూ

ఆస్కార్ లెవల్ ఫిల్మ్ ‘విసారనై'లో నటించే అవకాశం ఇచ్చిన వెట్రిమారన్ సార్ నాకు గాడ్ ఫాదర్. ఈ సినిమాలో నటించడంతో నా జన్మసార్థకమైంది. వారి వర్కింగ్ స్కఇదంతా కేవలం తమిళ ఇండస్ట్రీ వల్లే అని అజయ్ ఘోష్ వ్యాఖ్యానించారు. 28 రోజులు వెట్రిమారన్ సార్, ఆయన టీంతో పని చేసాను... వారి వర్కింగ్ స్టైల్ సూపర్ అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ కళ్ల జోడు పెట్టుకుని బిల్డప్పులివ్వడమే ఎక్కువ ఉంటుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

తెలుగు మీడియాపై, ప్రజలపై, చివరకు ఆటో వాలాపై కూడా అజయ్ విమర్శలు

తెలుగు మీడియాపై, ప్రజలపై, చివరకు ఆటో వాలాపై కూడా అజయ్ విమర్శలు

తమిళ్ పీపుల్ గ్రేట్ పొలిటికల్ అవేర్ నెస్, గ్రేట్ సోషల్ అవేర్ నెస్ కలిగి ఉన్నారు. ఇండియాలో ఇతర ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి అవేర్ నెస్ లేదు... అంటూ అజయ్ ఘోష్ తమిళులను కాకా పట్టే ప్రయత్నం చేసారు అజయ్. తెలుగు మీడియాపై కూడా అజయ్ ఘోష్ విమర్శలు గుప్పించాడు. ముందు తమిళ మీడియానే తనలోని టాలెంటును గుర్తించింది.... వారిని చూసి తెలుగు మీడియా తనను గుర్తించిందన్నారు. తమిళనాడులో ఏ ఆటోట్రైవర్ అన్నను చూసినా... పేపర్ చదువుతూ కనిపిస్తాడు. తెలుగులో పొగాకు, గుట్కాలు నములుతూ కనిపిస్తారు. తెలుగు సాంబారు మోషన్స్, కడుపు ఉబ్బరం లాంటివి వస్తాయి. తమిళ సాంబారు అమృతంలా ఉంటుంది అంటూ అజయ్ ఘోష్ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
Telugu actor Ajay Ghosh Apology For Comments on Telugu Film Industry. I did not intend to displease any Telugu actor or person with my speech, Ajay Ghosh said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu