»   » తెలుగు ఇండస్ట్రీ, మీడియా వేస్ట్: అజయ్ ఘోష్ వివాదాస్పద కామెంట్స్

తెలుగు ఇండస్ట్రీ, మీడియా వేస్ట్: అజయ్ ఘోష్ వివాదాస్పద కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు నటుడు అజయ్ ఘోష్.... తమిళనాడులో ఓ సినిమా వేడుకలో మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్ చేసారు. తెలుగు ఇండస్ట్రీ, తెలుగు మీడియా వేస్ట్.... తమిళ ఇండస్ట్రీ, తమిళ మీడియా చాలా బెస్ట్ అంటూ కామెంట్ చేసారు.

నేను సెంట్రల్ చెన్నైలో దిగగానే నమిస్కరించుకునేది ముందు చెన్నై తల్లికి.... తెలుగు ఇండస్ట్రీ కంటే నాకు తమిళ ఇండస్ట్రీనే ముఖ్యం. తమిళ ఇండస్ట్రీ వల్లే నటుడిగా నా కల నెరవేరిందని అజయ్ ఘోష్ అన్నారు.

ఇక్కడ కెమెరా వెనక కూడా నటించాలి

ఇక్కడ కెమెరా వెనక కూడా నటించాలి

తెలుగు ఇండస్ట్రీలో కెమెరా ముందు మాత్రమే కాదు... ఆఫర్ల కోసం కెమెరా వెనక కూడా నటించాలి. కానీ తమిళ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదు. తమిళ ఇండస్ట్రీ చాలా గ్రేట్ అంటూ అజయ్ ఘోష్ అన్నారు.

నా గాడ్ ఫాదర్ వెట్రిమారన్

నా గాడ్ ఫాదర్ వెట్రిమారన్

ఆస్కార్ లెవల్ ఫిల్మ్ ‘విసారనై'లో నటించే అవకాశం ఇచ్చిన వెట్రిమారన్ సార్ నాకు గాడ్ ఫాదర్. ఈ సినిమాలో నటించడంతో నా జన్మసార్థకమైంది. వారి వర్కింగ్ స్కఇదంతా కేవలం తమిళ ఇండస్ట్రీ వల్లే అని అజయ్ ఘోష్ వ్యాఖ్యానించారు. 28 రోజులు వెట్రిమారన్ సార్, ఆయన టీంతో పని చేసాను... వారి వర్కింగ్ స్టైల్ సూపర్ అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ కళ్ల జోడు పెట్టుకుని బిల్డప్పులివ్వడమే ఎక్కువ ఉంటుందన్నారు.

తమిళ్ పీపుల్ గ్రేట్

తమిళ్ పీపుల్ గ్రేట్

తమిళ్ పీపుల్ గ్రేట్ పొలిటికల్ అవేర్ నెస్, గ్రేట్ సోషల్ అవేర్ నెస్ కలిగి ఉన్నారు. ఇండియాలో ఇతర ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి అవేర్ నెస్ లేదు... అంటూ అజయ్ ఘోష్ తమిళులను కాకా పట్టే ప్రయత్నం చేసారు అజయ్.

తెలుగు మీడియాపై

తెలుగు మీడియాపై

తెలుగు మీడియాపై కూడా అజయ్ ఘోష్ విమర్శలు గుప్పించాడు. ముందు తమిళ మీడియానే తనలోని టాలెంటును గుర్తించింది.... వారిని చూసి తెలుగు మీడియా తనను గుర్తించిందన్నారు.

ఆటో వాలాపై, సాంబారుపై విమర్శలు

ఆటో వాలాపై, సాంబారుపై విమర్శలు

తమిళనాడులో ఏ ఆటోట్రైవర్ అన్నను చూసినా... పేపర్ చదువుతూ కనిపిస్తాడు. తెలుగులో పొగాకు, గుట్కాలు నములుతూ కనిపిస్తారు. తెలుగు సాంబారు మోషన్స్, కడుపు ఉబ్బరం లాంటివి వస్తాయి. తమిళ సాంబారు అమృతంలా ఉంటుంది అంటూ అజయ్ ఘోష్ వివాదాస్పద కామెంట్స్ చేసారు.

English summary
Ajay Ghosh gave an impression that one has to act even behind the camera to bag offers in Telugu Film Industry. He told, 'My first interest has always been Tamil Industry. Tamil People have great political awareness and social awareness. Tamil Media was the first to recognize my talent after working in Oscar-level flick 'Visaranai'. It was only after that Telugu Media began focusing on Me'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu