»   » సీమాంధ్రలో చిన్నోడు, తెలంగాణలో అన్న

సీమాంధ్రలో చిన్నోడు, తెలంగాణలో అన్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రెండు రాష్టాలగా విడిపోయిన నేపధ్యంలో రెండు చోట్ల సినిమాలు చేయాలంటే రెండు చోట్ల ఉన్నవారిని ఎట్రాక్ట్ చేసే స్ట్రాటజీతో రావాలి. అదే స్ట్రాటజీతో ఓ డబ్బింగ్ సినిమా వస్తోంది. అజిత్ హీరోగా తమిళంలో రూపొందించిన 'అట్టగాసం' చిత్రం తెలుగులో అనువదింపబడుతోంది. ఈ చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేస్తారు. ఆ రెండు పాత్రలు రెండు ప్రాంతాల వారని ఎట్రాక్ట్ చేసేలా సీమాంధ్ర చిన్నోడిగా, తెలంగాణ అన్నగా కనిపించనున్నాయి. జి.ఎస్.ఎల్.ప్రొడక్షన్స్ పతాకంపై శరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో 'నాతో పెట్టుకోకు' అనే పేరుతో విడుదల చేయనున్నారు.

నిర్మాత జి.ఎస్.లత మాట్లాడుతూ.... అజిత్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో సీమాంధ్ర చిన్నోడిగా, తెలంగాణ అన్నగా కన్పిస్తారని, ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేసి మేలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఐదు పాటలతో రూపొందిన ఆడియోను త్వరలో విడుదల చేస్తామని, తమిళంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయాన్ని అందుకుంటుందని తెలిపారు. పూజ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెమెరా:వెంకట్, సంగీతం:్భరద్వాజ్, నిర్మాణ సారథ్యం:దేవానందం, నిర్మాత:జి.ఎస్.లత, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శరన్.

Ajith Attagasam in Telugu as Naatho Pettukok

తాజాగా అజిత్ చిత్రానికి 'వెయ్యి బుల్లెట్లు' ('ఆయిరం తోట్టాక్కల్‌') అనే టైటిల్ పెట్టారని సమాచారం. అనుష్క హీరోయిన్ కావటం, ఈ టైటిల్ సినిమాకు ఎక్కడలేని మాస్ ఇమేజ్,గ్లామర్ వచ్చేసిందని సినీ వర్గాలు అంటున్నాయి. తన చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలిచే హీరో అజిత్‌. 'ఆరంభం', 'వీరం' వంటి వరుస హిట్లతో ఆయన స్థాయి మరింత పెరిగింది. దీనికి తోడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో తొలిసారిగా నటించనుండటంతో కోలీవుడ్‌లోనే ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 9న ప్రారంభోత్సవం కూడా జరుపుకుందీ చిత్రం.

అజిత్‌కు జంటగా.. అనుష్క, ఎమీ జాక్సన్‌ ఆడిపాడనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి 'ఆయిరం తోట్టాక్కల్‌' (వేయి తూటాలు) అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. స్టెలీష్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ఆ పేరు తగినదని చిత్ర యూనిట్‌ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ టైటిల్ తో ఒక్కసారిగా ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోయినట్లు చెప్తున్నారు. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ ఇందులో అజిత్‌ను సరికొత్త గెటప్‌లో చూపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అజిత్‌ హెయిర్‌స్టెల్‌ వినూత్నంగా ఉండనుందని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

English summary
Ajith's hit flick ‘Attagasam’ is releasing in telugu as ‘Natho Pettukoku’. Filmmakers say Ajith will be seen in dual roles as Seemandhra Chinnodu and Telangana Anna in the mass entertainer. Charan is the director for the film which starred Sujatha and Pooja in lead roles. Bharadwaj is the music director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu