For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Thegimpu Twitter Review: తెగింపు మూవీకి అలాంటి టాక్.. అదే పెద్ద మైనస్.. అజిత్ హిట్ కొట్టాడా అంటే!

  |

  పేరుకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా దక్షిణాదితో పాటు నార్త్‌లోనూ ప్రభావాన్ని చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు థలా అజిత్ కుమార్. కెరీర్ ఆరంభంలోనే విలక్షణమైన నటన.. విభిన్నమైన శైలి.. పక్కా కమర్షియల్ సినిమాలతో స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అజిత్ ఇప్పుడు 'తెగింపు' (తమిళంలో తునివు) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

  తెగింపుగా వచ్చిన అజిత్ కుమార్

  తెగింపుగా వచ్చిన అజిత్ కుమార్

  కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోథ్ రూపొందించిన చిత్రమే 'తెగింపు'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో మంజూ వారియర్‌ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ఇందులో సముద్రఖని, వీరా, భగవతి పెరుమాల్, అజయ్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

  కిటికీ లాంటి టాప్‌లో సీతా రామం హీరోయిన్: ఏం దాచాలో అవే కనిపించేలా!

  అలాంటి కథ... అన్నీ కలగలిపే

  అలాంటి కథ... అన్నీ కలగలిపే

  అజిత్ కుమార్ సినిమాలు అంటేనే అన్ని హంగులూ కనిపిస్తూ ఉంటాయి. 'తెగింపు'లోనూ ఇదే ఫాలో అయ్యారు. ఓ వ్యక్తి ఓ మాల్‌ను హైజాక్ చేయడం.. అతడిని పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నించడం.. ఈ క్రమంలోనే అతడి బ్యాగ్రౌండ్ తెలుసుకోవడం వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక, ఇందులో ఫన్, ఎమోషన్స్, ఫైట్స్ ఇలా అన్నింటినీ జోడించారు.

  ట్విట్టర్‌లో సినిమాకు టాక్ ఇలా

  అజిత్ కుమార్ నటించిన 'తెగింపు' మూవీ ఎన్నో అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో ఈ సినిమా షోలు పడ్డాయి. దీంతో ట్విట్టర్ వేదికగా చాలా మంది ఈ సినిమాపై తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. నెటిజన్ల నుంచి మాత్రం ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చిందని చెప్పాలి.

  ఫస్టాప్ ఎలా ఉందో తెలుసా?

  థలా అజిత్ కుమార్ నటించిన 'తెగింపు' సినిమాను వీక్షించిన ఓ నెటిజన్ తాజాగా సినిమా ఫస్టాఫ్ గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అందులో 'అజిత్ కుమార్ నటించిన తెగింపు సినిమా ఫస్టాఫ్ చాలా బాగుంది. స్టోరీ అంతా పరుగులు పెడుతూ ఆసక్తిని రేకేత్తించేలా నడిచింది. అలాగే, అజిత్ కుమార్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు' అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

  సెకెండాఫ్ బెటర్‌గా అంటూ

  అజిత్ కుమార్ - హెచ్ వినోథ్ కాంబినేషన్‌లో రూపొందిన 'తెగింపు' సినిమాను చూసిన ఇంకో నెటిజన్ ట్విట్టర్‌లో 'ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ చాలా బాగుంది. ఇందులో అజిత్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నా దర్శకుడు వినోథ్ ఫ్యాన్స్ మెచ్చే మూమెంట్లను పెట్టి తృప్తి పరిచాడు. అయితే ఓవరాల్‌గా స్క్రీన్‌ప్లే మీద ఆయన మరింత దృష్టి పెట్టాల్సింది' అంటూ వెల్లడించాడు.

  ఒక బిల్లా.. ఒక తునివు అని

  ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'తెంగిపు' సినిమాను చూసిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో తనదైన శైలిలో పోస్ట్ చేశాడు. అందులో 'ఒక బిల్లా, ఒక మంకత, ఒక తునివు.. థలా అజిత్ కుమార్ కంటెంట్‌తో తన విశ్వరూపం చూపించాడు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఎంతో మంది ఈ సినిమాలో అజిత్ కుమార్ వన్ మ్యాన్ షో చేశాడని ట్విట్టర్‌లో కామెంట్లు చేస్తున్నారు.

  ఓవరాల్‌గా మూవీ టాక్ ఇలా

  ఓవరాల్‌గా మూవీ టాక్ ఇలా

  'తునివు' చిత్రాన్ని చూసిన మరొక నెటిజన్ 'తెగింపు ఓవరాల్‌గా ఒక ఆసక్తికరమైన సెటప్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్. కానీ, దర్శకుడు కథను సరిగా చెప్పడంలో తడబడ్డాడు. అయితే, అజిత్ తన మ్యానరిజమ్స్, మాస్ మూమెంట్స్‌తో ఈ సినిమాను నడిపాడు. స్క్రీన్‌ప్లే ఎక్కువగా ఆసక్తిని కలిగించదు. కాబట్టి ఈ చిత్రం ఏవరేజ్‌గా ఉంది' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

  సినిమాలో పెద్ద మైనస్ అదే

  సినిమాలో పెద్ద మైనస్ అదే

  ఇప్పటి వరకూ ట్విట్టర్‌లో చూసిన ట్వీట్ల ఆధారంగా.. అజిత్ కుమార్ నటించిన 'తెగింపు' మూవీలో స్క్రీన్‌ప్లే బాలేదని అర్థం అవుతోంది. సినిమా బ్యాంకు దోపిడీలకు సంబంధించిన మెసేజ్‌తో వచ్చినప్పటికీ దాన్ని ప్రేక్షకులను అలరించే కోణంలో దర్శకుడు దృష్టి పెట్టాడట. దీంతో ఈ చిత్రానికి సోల్ మిస్ అయినట్లు అనిపిస్తుందని సినిమాను చూసిన వాళ్లంతా చెబుతున్నారు.

  English summary
  Kollywood Star Hero Ajith Kumar Did Thegimpu Movie Under H. Vinoth Direction. Lets See This Movie Twitter Review Details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X