»   » చిరు, ఎన్టీఆర్ ఆసక్తి: ప్లాపవుతుందని ఫ్యాన్స్ ఆందోళన!

చిరు, ఎన్టీఆర్ ఆసక్తి: ప్లాపవుతుందని ఫ్యాన్స్ ఆందోళన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త‌మిళ‌నాట అజిత్ నటించిన 'వేదాళ‌మ్‌' అక్కడ భారీ విజయం సాధించింది. ఈ సినిమాను 'ఆవేశం' పేరుతో డ‌బ్బింగ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో ఇక్క‌డివారు రీమేక్ చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్లు టాక్.

గత కొద్ది రోజులు గా తెలుగు ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ టాక్ మొదలైంది. చిరంజీవి రీసెంట్ గా అజిత్ హీరోగా వచ్చి హిట్టైన ‘వేదాలం' కన్నుపడిందని. ఈ మేరకు ఆయన రీసెంట్ గా ఈ చిత్రం చూడటం జరిగిందని చెప్తున్నారు. తన 150 వ చిత్రంగా ఈ రీమేక్ ఎలా ఉంటుందని తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చూసారని.... తమకు సూటైతే రీమేక్ ఆలోచన ఉండబట్టే చూసారనే ప్రచారం జరుగుతోంది.

Vedalam

ఈ వార్తలు విన్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 'వేదాళ‌మ్‌'లోని స్టోరీ పాయింట్ ఎన్టీఆర్, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన‌ 'ఊస‌ర‌వెల్లి' సినిమాకి ద‌గ్గ‌ర‌గా ఉందని అంటున్నారు. అదే నిజమై తెలుగులో భారీ ప్లాప్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను రీమేక్ చేయక పోవడమే మంచిదని అంటున్నారు.

వేదాలం చిత్రం రెగ్యులర్ రొటీన్ మాస్ మసాలతో, చెల్లి సెంటిమెంట్ తో సాగే చిత్రం అని తమిళ సినిమా వర్గాలు చెప్పుకొచ్చాయి. అయితే ఈ స్ధాయిలో సక్సెస్ అవటం చిరంజీవి, ఎన్టీఆర్ దృష్టి పడటానికి కారణమైందని అంటున్నారు. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తొలి వారంలోనే రూ.45కోట్లకు పైగా వసూలు చేసింది. లాంగ్ రన్ లో వంద కోట్లు వసూలు చేయటం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

మరో ప్రక్క 'వేదలం' సినిమాను 'ఆవేశం' పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో తెలుగులో 'అఖిల్' రిలీజ్ ఉండటంతో, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం రీమేక్ వార్తలు వస్తున్న నేపథ్యంలో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ పై డౌట్ ఏర్పడింద్. ఎన్టీఆర్ తో పాటు రీ ఎంట్రీకి రెడీ అవుతున్న మెగాస్టార్ కూడా వేదలం సినిమా రీమేక్ పై ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు రావటంతో సినిమాకు ఎక్కువ రేటు చెప్పే అవకాసం ఉంది. మరి ఈ సినిమా ఆవేశంగా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతుందా..? లేకా రీమేక్ అవుతుందా..? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English summary
Ajith's Vedalam story in talk. Source said that this story line similar to NTR Oosaravelli.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu