»   » వివేకం కలెక్షన్ల సునామీ... 200 కోట్ల వైపు పరుగు

వివేకం కలెక్షన్ల సునామీ... 200 కోట్ల వైపు పరుగు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన వివేకం చిత్రం బాక్సాఫీస్ ను కుదిపేస్తున్నది. ఈ చిత్రం అంచనాలను తిరగ రాస్తూ కలెక్షన్ల సునామీని సష్టిస్తుంది. సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ కలెక్షన్లపై ఏలాంటి ప్రభావం పడక పోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను కురిపిస్తూ రూ. 200 కోట్ల క్లబ్ లోకి దూసుకేళ్తున్నది.

150 కోట్ల వసూళ్లు...

150 కోట్ల వసూళ్లు...

వివేకం చిత్ర వసూళ్లు సినీ పండితులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. విడుదలైన కొత్త చిత్రాలకు ధీటుగా కలెక్షన్లు సాధిస్తూ వివేకం రూ. 150 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల విడుదలైన తాజా చిత్రాల్లో వివేకం నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

జీఎస్టీ తర్వాత 100 కోట్లు...

జీఎస్టీ తర్వాత 100 కోట్లు...

భారీ అంచనాల మధ్య విడుదలైన వివేకం చిత్రం పలు వర్గాల ప్రేక్షకులను నిరాశపరిచింది. అయినా వసూళ్ల పరంగా చూస్తే అజిత్ జోరు ఏ మాత్రం తగ్గలేదని స్పష్టమైంది. జీఎస్టీ తర్వాత 100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి చిత్రంగా వివేకం రికార్డు క్రియేట్ చేసింది.

బాహుబలి రికార్డులకు చెక్...

బాహుబలి రికార్డులకు చెక్...

తొలివారం ముగిసేనాటికి వివేకం రూ. 100 కోట్ల మైలు రాయిని సునాయాసంగా అధిగమించింది. అత్యంత సాంకేతిక విలువలతో రూపొందించిన ఈ చిత్రం అజిత్ స్టామినాకు అద్దం పట్టింది. అంతేకాకుండా చెన్నైలో బాహుబలి నెలకొల్పిన రికార్డులను తిరగరాసింది.

200 కోట్ల క్లబ్ వైపు...

200 కోట్ల క్లబ్ వైపు...

వివేకం విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్ల ప్రవాహం జోరుగా సాగుతున్నది. వందకోట్ల వసూళ్లు చేసిన కొద్ది రోజులకే రూ. 150 కోట్ల మైలురాయిని అధిగమించడం తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తుంది. వివేకం జోరు చూస్తుంటే రూ. 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమనిపిస్తుంది.

నాలుగో స్థానంలో...

నాలుగో స్థానంలో...

తమిళ చిత్ర పరిశ్రమలో జోరును కొనసాగిస్తున్న చిత్రాల్లో ఐటీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా... కథనాయగన్, నెర్పుడా, వివేకం, యుద్ధం శరణం కొనసాగుతున్నాయి.

ఐటీకి ధీటుగా...

ఐటీకి ధీటుగా...

ఇటీవల విడుదలైన హాలీవుడ్ హరర్ చిత్రం ఐటీ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ చిత్రం స్టిఫెన్ కింగ్ అనే రచయిత రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రానికి ధీటుగా వివేకం వసూళ్లు రాబట్టడం విశేషం.

English summary
Ajith Kumar’s Vivegam has many records to boast about – As of 8th September the film officially became part of the Rs 150 crore club at the worldwide Box office. This is the first film post GST to have fared phenomenally at the BO. The film also managed to BEAT Baahubali 2 at the Chennai BO
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu