twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో కావాలనుకుందే ఆయన్ని చూసి.. గబ్బర్ సింగ్‌తోనే గుర్తింపు.. ఆకాష్ పూరి!

    |

    Recommended Video

    Akash Puri Interview About Mehbooba (Video)

    డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన తాజా చిత్రం మెహబూబా. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎమోషన్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియా, పాక్ బోర్డర్ లో సాగే కథలా కనిపిస్తోంది. ఈ చిత్ర పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. మే 11 న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండడంతో చిత్ర యూనిట్ భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యంగ్ బ్యూటీ నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజగా జరిగిన ఇంటర్వ్యూలో ఆకాష్ పూరి మెహబూబా చిత్రం గురించి అనేక విషయాలు వెల్లడించాడు.

    నేహాతో కెమిస్ట్రీ

    నేహాతో కెమిస్ట్రీ

    ఈ చిత్రంలో నేహా శెట్టి, తనకు మధ్య కెమిస్ట్రీ బావుంటుందని ఆకాష్ పూరి తెలిపాడు. క్లైమాక్స్ సన్నివేశాలో ఇద్దరం చాలా కష్టపడ్డామని ఆకాష్ తెలిపాడు. నాన్నగారి దర్శకత్వంలో ఇబ్బంది పడ్డ సందర్భాలు లేవని, ఆయన చెప్పింది చెప్పినట్లు చేసానని ఆకాష్ తెలిపాడు.

    ఆయన్ని చూసే హీరో కావాలనుకున్నా

    ఆయన్ని చూసే హీరో కావాలనుకున్నా

    నాన్న, రవితేజ గారు ఇద్దరూ మంచి స్నేహితులు. నాన్నగారితో రవితేజగారిని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం నుంచి చూస్తున్నా. రవితేజ గారు, నాన్నగారి కాంబినేషన్లో ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. చిన్నప్పటి నుంచి రవితేజ గారిని దగ్గరగా చూసా. రవితేజ వలనే తాను హీరో కావాలని భావించానని ఆకాష్ తెలిపాడు.

    రాంచరణ్‌తో పాటు నేను కూడా

    రాంచరణ్‌తో పాటు నేను కూడా

    చిరుత చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు తొలి చిత్రం. ఆ చిత్రంతోనే ఆయన లాంచ్ అయ్యారు. తనకి కూడా చిరుతే తొలి చిత్రం కావడం అత్యంత సంతోషించదగ్గ విషయం అని అన్నారు. అంతకు ముందే ఆంధ్రావాలా, పోకిరి వంటి చిత్రాలలో తాను నటించాల్సి ఉండిందని కానీ అది జరగలేదని ఆకాష్ తెలిపాడు.

    తొలి పారితోషకం

    తొలి పారితోషకం

    తాను నటుడిగా తొలి పారితోషకం అందుకున్న చిత్రం ధోని అని ఆకాష్ తెలిపాడు. ఆ చిత్రంలో నటించినందుకు ప్రకాష్ రాజ్ తనకు రూ లక్ష రూపాయలు ఇచ్చారని ఆకాష్ పూరి తెలిపారు. నాన్న గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నపుడు నెలకు 10 వేలు జీతం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

    గబ్బర్ సింగ్ వలనే

    గబ్బర్ సింగ్ వలనే

    తాను చైల్డ్ అరిటిస్టుగా ఎన్ని చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో వచ్చిందని ఆకాష్ పూరి అన్నారు. అందుకు హరీష్ శంకర్ గారికి కృతజ్ఞతలు అని ఆకాష్ తెలిపాడు. గబ్బర్ సింగ్ చిత్రంలో పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ చిన్ననాటి పా

    English summary
    Akash Puri about Ravi Teja and Pawan Kalyan. Mehabooba world wide release on May 11
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X