»   » ఇక్కడ ఎవ్వడూ పతివ్రత కాదు: ఆకాష్ పూరి షేర్ చేసిన వీడియో సంచలనం!

ఇక్కడ ఎవ్వడూ పతివ్రత కాదు: ఆకాష్ పూరి షేర్ చేసిన వీడియో సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్‌ను విచారించడం, ఆయనపై మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన తనయుడు ఆకాష్ పూరి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పూరి అభిమాని పేరుతో ఒక వ్యక్తి మొహం కనిపించకుండా కేవలం వాయిస్ ఓవర్‌తో..... పూరీకి మద్దతుగా జరుగుతున్న పరిణామాలపై మాట్లాడిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పూరీ ఫ్యాన్స్, సినిమా ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

ఆకాష్ పూరి షేర్ చేసిన ఆ వీడియోలో ఏముంది? అందులో పూరి అభిమాని చెప్పిన సంగతులు ఏమిటి? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం.

పూరిని వెనకేసుకు రావడం లేదంటూనే...

పూరిని వెనకేసుకు రావడం లేదంటూనే...

‘మన దేశంలో ఏ తప్పు చేసినా శిక్షించడానికి చట్టం ఉందని అందరికీ తెలుసు. కానీ ఆ చట్టం అందరికీ వర్తించినపుడే ఆ చట్టానికి విలువనిస్తాం. మేము ఇక్కడ పూరి జగన్నాథ్ గారిని వెనకేసుకురావడం లేదు. ఒక్కసారి మేము చెప్పే మాటలు వినండి'... అంటూ ఆ వీడియో మొదలైంది.

Puri Jagannadh Reveals Names In Tollywood Drug Scandal | Filmibeat Telugu
ఏమిటిసార్ ఈ దౌర్భాగ్యం

ఏమిటిసార్ ఈ దౌర్భాగ్యం

‘ఏమిటిసార్ మనకు ఈ దౌర్భాగ్యం, ఏమి చేశారు సార్ మీకు ఈ సినిమా వారు? కొన్ని కోట్లు దోచుకుంటున్న రాజకీయ నాయకులపై చూపించండి మీ చట్టాలు. ఆడపిల్లలను అన్యాయం చేసి పాడు చేస్తున్న బడాబాబులకు వర్తింపజేయండి మీ చట్టాలు' అంటూ పూరి అభిమాని ఆవేశంగా స్పందించిన వీడియోను ఆకాష్ పూరి షేర్ చేశారు.

ముందు మీది కడుక్కోండి సార్

ముందు మీది కడుక్కోండి సార్

‘ఆయన మీ ఇంట్లో సొమ్ము దోపిడీ చేయలేదే. ఆయన సొమ్ము ఎవడో దోచుకున్నా మళ్లీ సంపాదించుకున్నాడు. 80 కోట్ల అప్పులో కూరుకుపోయి కూడా నా లాంటి చాలా మంది కుర్రాళ్లకు జీవితం ఒక యుద్ధం, పోరాడు అని పాఠాలు నేర్పించాడు. ఆయన్ను వేలెత్తి చూపిన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. మిగతా నాలుగు వేళ్లు మిమ్మల్ని చూపిస్తున్నాయని, ముందు మీది కడుక్కోండి సార్. అవతలివాళ్లకు తర్వాతి చెబుదురు మీకు అంటుకుందని' అంటూ ఘాటుగా స్పందించాడు పూరి అభిమాని.

ఆయన వల్ల దేశం పాడవుతుందా?

ఆయన వల్ల దేశం పాడవుతుందా?

‘ఆయన వలన దేశం పాడవుతుందా? ఆయన చెప్పిన డైలాగులు కొన్ని పాటించినా ఈ దేశం పరిస్థితి మరోలా ఉండేదేమో? వ్యక్తిగత బాధ్యత ముఖ్యమని చెప్పాడు. రాంబాబు సినిమాలా ఎవడు పాటిస్తున్నాడు. టెంపర్ లో కోర్టు సీన్ అర్థం చేసుకుంటే ఏ ఇంట్లో తండ్రి అయినా తన కూతురు ఇంటికి వచ్చే వరకు టెన్షన్ పడడు. ప్రపంచంలో ఏ ఎదవ కూడా తాను ఎదవ అని ఒప్పుకోడు. జీవితంలో గోల్ అంటూ ఉండాలని బిజినెస్ మేన్ ద్వారా చెప్పాడు. నీతులు బోలెడు చెప్పాడు, కానీ ఎవరూ పాటించడు' అంటూ ఆ వీడియోలో అభిమాని చెప్పుకొచ్చారు. ఈ వీడియో పూరి కొడుకు ఆకాష్ షేర్ చేయడంతో సంచలనం అయింది.

ఎవరి కుటుంబం కూల్చలేదు

ఎవరి కుటుంబం కూల్చలేదు

"ఒక స్థాయికి రావడం అంటే ఈజీ కాదు సార్. అలాంటిది కొంత మందిని ఒక స్థాయిలో నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆయన వల్ల కొన్ని కుటుంబాలు నిలబడ్డాయి. కొందరి వలన కొన్ని కుటుంబాలు కూలిపోయాయి. వాళ్లను పట్టుకోండి పోయి. చెడ్డీలు తొడుక్కుని చంకలో పలక పెట్టుకుని బడికి వెళ్లే పిల్లవాడికి తెలుసు అన్నీ ఉన్నా ట్రాఫిక్ పోలీసు రూ. 100 గుంజుతాడని, ఇదేనా మీ చట్టం." అంటూ పూరి అభిమాని ఫైర్ అయ్యారు.

వాళ్లూ మనుషులే

వాళ్లూ మనుషులే

‘బలహీనతలు ప్రతీ ఒక్కరికీ ఉంటాయి. నీలో నాలో మనందరిలో. వాటిపై గుచ్చి గుచ్చి బజారుపాలు చేయకండి. మీ ఇంట్లో భార్య, కూతురు ఉన్నట్లే ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఆయనకు ఒక బాధ్యత ఉంది. వాళ్లూ మనషులే. కష్టాన్ని దాంటుకుంటూ.. కన్నీళ్లు దిగమింగుకుంటూ ఆ స్థాయికి ఎదిగాడు' అని పూరి గురించి చెప్పుకొచ్చారు.

ఇక్కడ ఎవ్వడూ పతివ్రత కాదు

ఇక్కడ ఎవ్వడూ పతివ్రత కాదు

‘మళ్లీ చెబుతున్నా ఇక్కడ ఎవ్వడూ ప్రతివ్రత కాదు. చూసి నేర్చుకోవాల్సిన క్యారెక్టర్ అరుదు ఇక్కడ. లక్షల కోట్లు ఎగ్గొట్టి దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిన వారిని ఏం చేయలేం మనం. ఎవడి పర్సనల్స్ వాడికుంటాయి. ఎవడి లైఫ్ వాడిది' అంటూ తనదైన శైలిలో పూరిపై అభిమానం ప్రదర్శించాడు.

ఏం నీ ఇంటికొచ్చి చెప్పాడా డ్రగ్స్ వాడామని

ఏం నీ ఇంటికొచ్చి చెప్పాడా డ్రగ్స్ వాడామని

‘ఏం నీ ఇంటికొచ్చి చెప్పాడా డ్రగ్స్ వాడామని, ఎదైనా బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడా? ఏం సినిమా వాళ్లే డ్రగ్స్ వాడతారా? రాజకీయనాయకులు ఎవరూ లేరా? రౌడీలు ఎవరూ లేరా? బినామీలు ఎవరూ లేరా? ఎందుకు ఉండరు అందరూ ఉంటారు. మీకు పబ్లిసిటీకి ముందుగా కనిపించేది సినిమా వారే' అంటూ ఫైర్ అయ్యారు.

వాళ్లకీ కుటుంబాలుంటాయి

వాళ్లకీ కుటుంబాలుంటాయి

‘సినిమా వాళ్లకీ కుటుంబాలుంటాయి. వాళ్లకీ పరువు ప్రతిష్టలు ఉంటాయి. దయచేసి ప్రతి దానికి సినిమా వాళ్లని నిందించకండి. సినిమా వాళ్లకు గతి లేక కాదు, వేరేదానిపై మతిపోక సినిమానే నమ్మకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అందరి పేర్లు బయట పెట్టాలని కోరుతున్నాను. సార్ ఏది ఏమైనా ప్రాణం ఉన్నంత వరకు పూరి గారికి వీరాభిమానిని, ఇక్కడ ఎవడూ పతివ్రత కాదు. అందరినీ సమానంగా చూడాలి, అందరినీ సమానంగా శిక్షించాలి' అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఆకాష్ పూరి

అభిమాని వీడియోను ఆకాష్ పూరి షేర్ చేయడంతో ఇదో సంచలనం అయింది. ఈ వీడియో చూసిన పూరి అభిమానులు మరింత ఎమోషన్ అవుతున్నారు. తమ అభిమాన దర్శకుడు త్వరగా ఈ కేసు నుండి బయట పడాలి కోరుకుంటున్నారు.

English summary
Akash Puri shared a video about Drugs case issue. The video created by Puri Fan. "We know he is not involved and this truth will come out in the investigation," one of them who claimed to be Puri's fan said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu