»   »  ‘అఖిల్’ ఇంట్రో సాంగ్ లో కనిపించే స్పెషల్ గెస్ట్ లు వీరిద్దరే

‘అఖిల్’ ఇంట్రో సాంగ్ లో కనిపించే స్పెషల్ గెస్ట్ లు వీరిద్దరే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అక్కినేని కుటుంబంలో నటవారసుడిగా.. అఖిల్‌ తెరంగేట్రం చేస్తున్న చిత్రం 'అఖిల్‌'. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి మరింతగా క్రేజ్ తేవటానికి ఓ పాటను ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ పాటలో నాగార్జున, నాగచైతన్య కనిపించనున్నారని తెలుస్తోంది.

3 in one

నాగార్జున - నాగ చైతన్య కలిసి అఖిల్ సినిమాలో ఓ గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారని సమాచారం. అది కూడా అఖిల్ ఇంట్రడక్షన్ సాంగ్ లో అఖిల్ తో కలిసి కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆ సీన్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ డైరక్షన్ లో ఈ సాంగ్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.రీసెంట్ గా...అమెరికాలో ఘనంగా 'అఖిల్‌' ఆడియో విడుదల అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే...


'అఖిల్‌' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అమెరికాలోని డల్లాస్‌లో ఫెర్పార్మింగ్‌ ఆర్ట్స్‌ సెంటర్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు అక్కినేని అఖిల్‌, నిర్మాత సుధాకర్‌ రెడ్డి, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, పాటల రచయిత కృష్ణ చైతన్య తదితరులు హాజరయ్యారు. డల్లాస్‌కు చెందిన శ్రీకాంత్‌ పోలవరపు సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మంది తెలుగు వారు హాజరయ్యారు.


A big Thanks to everyone who supported the America tour and made it a success! Never thought I would see these numbers! Really shows the love and support you guys have for our Telugu industry. Love you!


Posted by Akhil Akkineni on29 September 2015


ఈ కార్యక్రమానికి రాజేష్‌ అడుసుమిల్లి, యాంకర్‌ గాయత్రి భార్గవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కీర్తి చామకూర ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనతో కూచిపూడి నృత్యం తరువాత అక్కినేని కుటుంబానికి చెందిన నటీనటుల చిత్రాల పాటలను డల్లాస్‌ గాయనీ గాయకులు ఆలపించారు. అలాగే కొన్ని పాటలకు హర్షిత్‌ వనం, వరుణ్‌ కర్రి, నరేన్‌ యలమంచిలి, రవితేజ చేసిన నృత్యాలు అలరించాయి.

ఈ కార్యక్రమం సందర్భంగా 30మంది తెలుగువారితో శాంతి నూతి దర్శకత్వంలో ప్రదర్శించిన 'ఏ.ఎన్‌.ఆర్‌ నృత్యాక్షరి' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా సంస్థ తరఫున సంస్థ ఛైర్మన్‌ తోటకూర ప్రసాద్‌ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావుకు డల్లాస్‌ వాసులకు మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించారు.


akhil 1

అగ్నిగోళాన్ని సైతం తన చేతుల్లో ఇముడ్చుకోగల ధీశాలి ఆ కుర్రాడు. భగ భగ మండే సూర్యుడిని తలపించే అతని పయనం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగిందో తెలియాలంటే 'అఖిల్‌' చిత్రాన్ని చూడాల్సిందే. అఖిల్‌ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. 'ది పవర్‌ ఆఫ్‌ జువా...' అనేది ట్యాగ్ లైన్. సాయేషా సైగల్‌ హీరోయిన్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌, సుధాకర్‌రెడ్డి నిర్మాతలు.


నిర్మాతలు మాట్లాడుతూ...''మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. అఖిల్‌ చేసే యాక్షన్‌ హంగామా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అని చెబుతున్నారు. సంగీతం: తమన్‌, అనూప్‌రూబెన్స్‌యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.


nayak2

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Buzz is Akhil will have his dad Nagarjuna and brother Naga Chaitanya special in the film. Both are currently participating in the intro song shoot progressing in Annapurna studios.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu