»   » రిలీజ్ ఖరారైంది: రామ్ చరణ్‌తో పోటీ పడుతూ అఖిల్ మూవీ

రిలీజ్ ఖరారైంది: రామ్ చరణ్‌తో పోటీ పడుతూ అఖిల్ మూవీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి సమర్పణలో యూత్ స్టార్ నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘అఖిల్'. ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. దసరా సందర్భంగా అక్టోబర్ 22న సినిమాను విడుదల చేస్తున్నట్లు దర్శకుడు వివి వినాయక్, హీరో అఖిల్ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీల ద్వారా వెల్లడించారు.

మరో వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' చిత్రం అక్టోబర్ 16న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కేవలం 6 రోజుల గ్యాప్‌తో ‘అఖిల్' సినిమా విడుదలవుతుండటం గమనార్హం. దసరా బాక్సాఫీసు రేసులో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. అయితే ఫైనల్ గా ఎవరు విన్నర్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.


ఈ రెండు సినిమాలకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు శ్రీను వైట్ల, వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే. రామ్ చరణ్ సినిమా అంటే క్రేజ్ భారీగానే ఉంటుంది. అదే సమయంలో నాగార్జున వారసుడు అఖిల్ తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.


Akhil Akkineni debut film to release on October 22nd

అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.


ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Much awaited Akhil Akkineni's debut film release date confirmed. The movie releasing on October 22nd.
Please Wait while comments are loading...