»   » సెన్సేషనల్ కిడ్‌తో అఖిల్.. పవన్ పాటలతో అలరించిన బుజ్జి ఎవరో తెలుసా?

సెన్సేషనల్ కిడ్‌తో అఖిల్.. పవన్ పాటలతో అలరించిన బుజ్జి ఎవరో తెలుసా?

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Akhil Akkineni Met Zbigniew Acharya Chertlur

  బిగ్నీవ్ ఆచార్య చెర్టులూరు అంటే కచ్చితంగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో తనదైన శైలిలో తెలుగు పాటలను పాడుతూ ఆకట్టుకునే పోలాండ్‌కు చెందిన బుజ్జి అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు.. టాలీవుడ్ హీరోలకు ఎంతో ఇష్టం అనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. గతంలో పవన్ కల్యాణ్, అఖిల్ సినిమాల పాటలను పాడుతూ యూట్యూబ్, సోషల్ మీడియాలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల అక్కినేని నటవారసుడు అఖిల్ ఆ బుజ్జిగాడిని కలుసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా బుజ్జి ఏమని ట్వీట్ చేశాడంటే..

  అఖిల్ సెట్స్‌కు బుజ్జి

  అఖిల్ సెట్స్‌కు బుజ్జి

  అఖిల్ ఇంకా పేరు పెట్టని తన తదుపరి చిత్ర షూటింగ్ పోలాండ్‌‌లో జరుగుతున్నది. ఆ సందర్భంగా బుజ్జుని అఖిల్ కలుసుకొన్నాడు. ఆ చిన్నారి బాలుడిని సెట్స్‌కు ఆహ్వానించి చిత్ర యూనిట్ అప్యాయంగా పలుకరించింది. సెట్స్ కొచ్చిన బుజ్జితో దిగిన ఫొటొను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

  ట్వీట్ చేసిన బుజ్జి

  అఖిల్‌ను కలిసిన తర్వాత బుజ్జి ట్విట్టర్‌లో స్పందించాడు. హ్యాండ్సమ్ అఖిల్‌, లవ్లీ నిధి అగర్వాల్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ వెంకీ అట్లూరిని కలువడం గొప్ప అనుభూతి. వారిని కలువడం మరిచిపోలేను. చాలా ఎంజాయ్ చేశాను. వారి చూపించిన ప్రేమకు మైమరిచిపోయాను అని బుజ్జి ట్వీట్ చేశారు.

  ఇంతకి బుజ్జి ఎవరంటే

  ఇంతకి బుజ్జి ఎవరంటే

  బుజ్జి ఎవరా అంటే.. తెలుగు మూలాలు ఉన్న అబ్బాయి. ఎన్నారై శరత్ చెర్టులూరు, ఉర్జులా ఎలిజెబెత్ కుమారుడు. అందుకే తెలుగు సినిమాలపై ఆసక్తి కలిగింది. బుజ్జి పాడిన వీడియో తొలిసారి 2016లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ బుడతడి గురించి అందరికీ తెలిసిపోయింది.

   యాక్టింగ్ అంటే బుజ్జికి ఇష్టం

  యాక్టింగ్ అంటే బుజ్జికి ఇష్టం

  బుజ్జికి యాక్టింగ్, పాటలు పాడటమంటే చాలా ఇష్టం. ఇప్పటికే పొలాండ్‌లో కొన్ని వ్యాపార ఉత్పత్తులకు మోడల్‌గా వ్యవహరిస్తున్నాడు. కొన్ని షార్ట్ ఫిలింస్‌లో కూడా నటించాడు. తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే నటించాలని ఎదురుచూస్తున్నాడు బుజ్జి.

  వర్మ సినిమాలో బుజ్జి

  వర్మ సినిమాలో బుజ్జి

  గతంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసే చిత్రంలో బుజ్జి నటిస్తున్నట్టు వార్తలు మీడియాలో ప్రచారమయ్యాయి. కానీ అవన్నీ గాసిప్స్ అని, వాటిలో వాస్తవం లేదని సినీ వర్గాలు కొట్టిపడేశాయి. ఇక ముందైనా తెలుగు సినిమాలో బుజ్జికి అవకాశాలు వస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

  వెంకీ డైరెక్షన్‌లో అఖిల్ అక్కినేని

  అఖిల్ చిత్రం తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అక్టోబర్, నవంబర్‌లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నది.

  English summary
  zbigniew Acharya Chertlur, fondly known as Bujji, is a popular boy among Telugu audience. The Poland boy is known for singing Telugu songs with perfect pronunciation. Over the years, he has been appreciated by Telugu superstars like Pawan Kalyan and Nagarjuna for a singing song from their films. Now, Akhil Akkineni has met this intriguing talent in Poland, where he was shooting for his upcoming film with Nidhi Aggarwal.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more