»   » హీరోయిన్‌తో అఖిల్ అక్కినేని హాట్ లుక్స్ (ఫోటోస్)

హీరోయిన్‌తో అఖిల్ అక్కినేని హాట్ లుక్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున వారసుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి సమర్పణలో హీరో నితిన్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

ఆగస్టు 11 నుండి ఈ చిత్రం కోసం హైదరాబాద్ సంఘీ ఫారెస్టులో కోట్ల రూపాయల వ్యయంతో వేసిన భారీ సెట్ లో క్లైమాక్స్ చిత్రీకరణ ఫైట్ మాస్టర్ రవివర్మ సారథ్యంలో పెద్ద ఎత్తున చిత్రీకరించడం మొదలు పెట్టారు. ఈ నెల 23 వరకు ఈ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. దీంతో 3 పాటలు మినహా చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.

Akhil Akkineni movie release date

నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 12 వరకు యూరఫ్ లో రెండు పాటలు చిత్రీకరిస్తాం. సెప్టెంబర్ 18 నుండి 23 వరకు హైదరాబాద్ లో భారీ సెట్స్ లో చివరి పాట చిత్రీకరించడంతో షూటింగ్ టోటల్ ఫినిష్ అయింది అన్నారు.

ఆగస్టు 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. అలాగే అక్కినేని నాగేశ్వరరావుగారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న భారీ ఎత్తున ఆడియో రిలీజ్ వేడుక చేస్తున్నాం. అక్టోబర్ 21న వరల్డ్ వైడ్ గా విజయదశమి కానుకగా సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తాం అన్నారు నితిన్.

Akhil Akkineni movie release date

హీరోయిన్ సాయేషా మాట్లాడుతూ ఆగస్టు 12న నా బర్త్ డే. ఇంత పెద్ద బేనర్లో సినిమా చేయడం, ఇంత భారీ చిత్రం షూటింగులో ఉండటం ఎంతో సంతోషకరమైన బర్త్ డే ఇది. అఖిల్ లాంచింగ్ ఫిలిమ్ లో హీరోయిన్ గా నటించే గొప్ప అవకాశం ఇచ్చిన వినాయక్ గారికి, నితిన్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం చాలా పెద్ద హిట్ కావాలి అన్నారు.

బిజినెస్ క్రేజ్ సమర్పకురాలు నిఖితా రెడ్డి మాట్లాడుతూ..‘అఖిల్ ఎక్స్ ట్రార్డినరీగా చేస్తున్నాడు. వినాయక్ గారు ఎక్సలెంట్ గా తీస్తున్నారు. మా బేనర్ కి ఇది ప్రెస్టీజియస్ ఫిలిం అవుతుంది. బిజినెస్ పరంగా ఈ చిత్రానికి చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. బయ్యర్లందరూ ఈ సినిమా కోసం పోటీ పడటం విశేషం. అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

Akhil Akkineni movie release date

అఖిల్ అక్కినేని, సాయేషా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్ కు చెందిన లెబాగా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి వెలింగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం, సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వివి వినాయక్.

English summary
Akhil Akkineni debut movie releasing on October 21.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu