»   » అఖిల్-వినాయక్ మూవీ థాయ్‌లాండ్ షూటింగ్ (ఫోటోస్)

అఖిల్-వినాయక్ మూవీ థాయ్‌లాండ్ షూటింగ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ అక్కినేని ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్‌లో జరుగుతోంది. ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలుకూడా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. షూటింగులో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తో పాటు మరికొందరు నటీనటులు పాల్గొన్నారు.

షూటింగ్ లొకేషన్‌కు సంబంధించిన ఫోటోలు స్టంట్ మాస్టర్ రవివర్మ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. నాగార్జున కూడా ఈ షూటింగును దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

దర్శకుడు వినాయక్ అఖిల్‌ను ఈ చిత్రంలో యాక్షన్ హీరోగా చూపించబోతున్నాడని ఈ మేకింగ్ వీడియో చూస్తే స్పష్టం అవుతుంది. ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ నుండి మాస్ ఇమేజ్ ఉన్న హీరో అంటూ లేడు. అందుకే అఖిల్‌ను మాస్ హీరోగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...

యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...

యాక్షన్ సీన్లతో పాటు డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు.

అఖిల్

అఖిల్

టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.

నితిన్

నితిన్

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
"Shooting for VV Vinayak's #ProductionA in Thailand with AkhilAkkineni8 iamnagarjuna" Stunt Ravi Varma tweeted.
Please Wait while comments are loading...