»   » అఖిల్ అక్కినేని రెండో సినిమాకు కూడా స్టార్ డైరెక్టరే!

అఖిల్ అక్కినేని రెండో సినిమాకు కూడా స్టార్ డైరెక్టరే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని త్వరలో వివి వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్' సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే అఖిల్ మాస్ అండ్ యాక్షన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నాగార్జునకు, నాగ చైతన్యలకు కలిసిరాని మాస్ యాక్షన్ ఇమేజ్.... అఖిల్‌ విషయంలో సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు భావిస్తున్నారు.

అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వినాయక్ ‘అఖిల్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి సినిమానే అయినప్పటికీ ఖర్చు పరంగా ఏ మాత్రం వెనకాడటం లేదు. స్టార్ హీరోల రేంజి బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అఖిల్ ఎంట్రీపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇప్పటికే దాదాపు 45 కోట్లకు పైగా అయినట్లు తెలుస్తోంది.

అక్కినేని ఫ్యామిలీ నుండి గతంలో చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే వారెవ్వరికి అఖిల్ రేంజిలో హైప్ రాలేదు. గతంలో నాగ చైతన్య పరిచయం అయిన సమయంలో కూడా ఇంత హైప్ లేదు. కానీ అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా విషయంలో మాత్రం క్రేజ్ భారీగా ఉంది.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండటం, స్వయంగా యంగ్ హీరో నితిన్ ఈచిత్రాన్ని నిర్మిస్తుండటం కూడా సినిమాపై హైప్ పెరగడానికి మరో కారణం. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.

Akhil Akkineni second Movie Director Confirmed?

అఖిల్ రెండో సినిమా......
అఖిల్ సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారంతా. మొదటి సినిమా విడుదలైన వెంటనే రెండో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. రెండవ సినిమా కూడా మంచి హైప్ రావాలంటే మాస్ డైరెక్టరే కావాలి. అందుకే 100 కోట్ల క్లబ్ దర్శకుడు కొరటాల శివతో నాగార్జున అఖిల్ రెండవ సినిమా విషయంపై చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

మిర్చితో ప్రభాస్ ని క్లాస్ విత్ మాస్ స్టయిల్లో ఆవిష్కరించి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన కొరటాల శివ ఇటీవల శ్రీమంతుడు విజయంతో మరోసారి తన సత్తా చాటాడు. శ్రీమంతుడులో మహేష్ బాబును క్లాస్ గా చూపిస్తునే కథకు అనుగుణంగా మాస్ యాంగిల్ లోనూ చూపించి సక్సెస్ అయ్యాడు. అఖిల్-కొరటాల శివ కాంబినేషన్ అయితే సినిమా తానే నిర్మిస్తానని బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

English summary
As 'Akhil' is ready to release in October 2015, Plans were afoot to finalize the combination of Akkineni Akhil's second flick.
Please Wait while comments are loading...