»   » ఇపుడు నో టెన్సన్స్: బ్యూటిఫుల్ లేడీతో అఖిల్ లంచ్ (ఫోటో)

ఇపుడు నో టెన్సన్స్: బ్యూటిఫుల్ లేడీతో అఖిల్ లంచ్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని చిన్నోడు అఖిల్.... ఆ మధ్య పెళ్లి రద్దయిన తర్వాత చాలా డిస్ట్రబ్డ్ గా ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి, కెరీర్ రెండు అంశాల మధ్య టెన్షన్స్ తో అఖిల్ నలిగిపోయాడని, ఈ పరిణామాలే అఖిల్ పెళ్లి రద్దుకు కారణం అయ్యాయని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఆ టెన్షన్స్ అన్నీ వదిలించుకుని తన కెరీర్ మీదే దృష్టి పెట్టిన అఖిల్.... ప్రస్తుతం విక్రమ్ కుమార్ తో చేసే సినిమా షూటింగులో బిజీ అయ్యాడు. అఖిల్ వరుస చూస్తుంటే ఇపుడు ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా ఫ్రీగా ఉన్నాడని స్పష్టమవుతోంది.

బ్యూటిఫుల్ లేడీతో అఖిల్ లంచ్

తాజాగా సినిమా సెట్స్ తో తన తల్లి అమలతో కలిసి భోజనం చేసిన అఖిల్.... అందుకు సంబంధించిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. బ్యూటిఫుల్ లేడీతో లంచ్ చేసాను. ఆమె నవ్వుంటే నాకు చాలా ఇష్టం. థాంక్యూ మై డియర్ మదర్ అంటూ అఖిల్ ట్వీట్ చేసారు.

అఖిల్ మూవీ విశేషాలు

అఖిల్ మూవీ విశేషాలు

అఖిల్ అక్కినేని ప్రస్తుతం మనం మూవీ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ పతాకాల పై నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నాగార్జున నిర్మాత.

హీరోగా నిలబెట్టేందుకు

హీరోగా నిలబెట్టేందుకు

అఖిల్ తొలి సినిమా దెబ్బకొట్టడంతో.... రెండో సినిమా విషయంలో అలాంటి పొరపాటు జరుగకుండా నాగార్జున దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా అఖిల్ ను హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

శరవేగంగా షూటింగ్

శరవేగంగా షూటింగ్

ఈ నెల మొదటి వారంలోనే షూటింగ్ ప్రారంభం అయింది. శర వేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.

English summary
"Had Lunch with this beautiful lady on sets today. Her smile is what I love most. 😘 thank you my dear mother !" Akhil tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu