»   » హీరోయిన్‌ కోసం అఖిల్ ఏం చేసాడో తెలుసా?

హీరోయిన్‌ కోసం అఖిల్ ఏం చేసాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ అక్కినేని ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి చిత్రం. ఇద్దరూ కలిసి నటిస్తుండటంతో అఖిల్, సాయేషా మంచి స్నేహితులయ్యారు.

Akhil Akkineni tweet about Sayesha

అయితే సాయేషాకు సోషల్ మీడియా ట్విట్టర్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో..... ఆమెకు ఫాలోయింగ్ పెంచేందుకు తన ట్విట్టర్ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టాడు అఖిల్. సాయేష సూపర్ టాలెండ్, చాలా కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి అంటూ ఆమెపై పొగడ్తలు గుప్పించారు.

అఖిల్‍కు ట్విట్టర్‌లో దాదాపు 4.79 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అఖిల్ తన పేజీలో సాయేషా ట్విట్టర్ లింక్ పోస్టు చేయడంతో అఖిల్‌ అభిమానులు కూడా సాయేషాను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు.

అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
"Welcome to the world of Twitter to the super talented and super hardworking wonder girl ... sayyeshaa ! There's no going back now :) enjoy" Akhil Akkineni tweeted.
Please Wait while comments are loading...