»   » మహేష్ బాబు తర్వాత ఆ రేంజి అఖిల్ వల్లే అవుతుంది!

మహేష్ బాబు తర్వాత ఆ రేంజి అఖిల్ వల్లే అవుతుంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి త్వరలో వెండితెరకు పరిచయం అవుతున్న యువ హీరో అఖిల్. తెరంగ్రేటానికి ముందు నుండే యునిక్ స్టైల్, యాటిట్యూడ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ స్టార్. దీంతో పలు కార్పొరేట్ సంస్థలు అఖిల్ తో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించడానికి పోటీ పడుతున్నాయి.

ఇప్పటి వరకు టాలీవుడ్లో మహేష్ బాబుతో చేయడానికి పలు కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. త్వరలో ఆ రేంజిని అందుకోబోయేది అఖిల్ మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. తాజాగా కార్బన్ మొబైల్స్ సంస్థ అఖిల్ ను తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని అఖిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇందుకు గాను భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్ మౌంటేన్ డ్యూ డ్రింక్ తో పాటు మరికొన్ని ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

 Akhil as brand ambassador for Karbon mobiles

‘అఖిల్' సినిమా విషయానికొస్తే...
అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
The young Sisindri reportedly got a fancy offer for endorsing Karbon Mobiles.
Please Wait while comments are loading...