»   » రూమర్ నిజమే...రెండో సినిమా విషయం తేల్చిన అఖిల్

రూమర్ నిజమే...రెండో సినిమా విషయం తేల్చిన అఖిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్..రెండో చిత్రం విషయమై ఓ క్లారిటీ వచ్చింది. గత కొద్ది రోజులుగా "అందాల రాక్షషి, కృష్ణగాడి వీరప్రేమగాధ" చిత్రాల ద్వారా అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న హను రాఘవపూడి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడంటూ ఫిల్మ్ నగర్ వర్గాలు గుసాగుసలాడుకొంటున్నాయి. ఇప్పుడదే నిజమైంది. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా ఖరారు చేసి తెలియచేసారు.

రెండో సినిమా ఎప్పుడూ అని చాలాకాలంగా ఎదురుచూస్తున్న వారందరినీ ఇంకా ఎదురుచూసేలా చేయదల్చుకోలేదని తెలుపుతూ, దర్శకుడు హను రాఘవపూడితో కొద్దికాలంగా స్కిప్ట్ వర్క్‌పై ఉన్నానని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తైందని అఖిల్ అన్నారు.

షూటింగ్ మొదలుపెట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ఆయన ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. 'అఖిల్' సినిమాతో భారీ హిట్ కొట్టి గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్న అఖిల్, ఆ సినిమా పరాజయం తర్వాత రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు.

ఇక ఎన్నో కథలు విని, ఎంతోమంది దర్శకులను మార్చి, చివరకు హను రాఘవపూడితో అఖిల్ తన కొత్త సినిమాను ఖరారు చేసేశారు. కొద్దిసేపటి క్రితం ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా స్పష్టం చేయటం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది.

English summary
Akhil, has confirmed his next project. As projected in the media from quite some time now, Akhil will be working in the direction of talented director Hanu Raghavapudi. This news was confirmed by Akhil himself on his twitter page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu