»   » అఖిల్..రెండు కొత్త వార్తలు, ఏది నిజమౌతుందో

అఖిల్..రెండు కొత్త వార్తలు, ఏది నిజమౌతుందో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని అఖిల్ తన తొలి చిత్రం అఖిల్ ఫ్లాఫ్ అయిన తర్వాత ఏ చిత్రమూ కమిట్ కాలేదు. దాంతో ఆయన ఫలానా దర్శకుడుతో చేయబోతున్నాడు..ఫలానా రీమేక్ చేస్తున్నాడు అంటూ గత కొద్ది నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిని కోపంతో, ఓపికతో,చిరాకుతో అప్పుడప్పుడూ ఖండిస్తూనే ఉన్నాడు అఖిల్.

తాజాగా అఖిల్ ఓ మళయాళి రీమేక్ లో నటించబోతన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దుల్హమ్ సల్మాన్ (ఓకే బంగారం ఫేమ్) హీరోగా మళయాళంలో వచ్చిన యూత్ ఫుల్ యాక్షన్ డ్రామా కామాటి పదం చిత్రం పై అఖిల్ ఆసక్తి చూపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే అఖిల్ ఇప్పటివరకూ ఆ సినిమా చూడలేదట. ఈ వీకెండ్ లో సినిమా చూసి నిర్ణయించుకుంటాడంటున్నారు.

కామాటిపదం చిత్రం క్రిటికల్ గా ఎక్లైమ్ అవటమే కాకుండా పెద్ద హిట్ చిత్రంగా మళయాళ భాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తెలుగులో అఖల్ తో హిందీలో అర్జున్ కపూర్ తో ఈ చిత్రం చేసే అవకాసం ఉందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 Akhil considered for Kammati Paadam remake

ఇదిలా ఉంటే... మరో రూమర్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అదేమిటంటే.... తాజా సమాచారం ప్రకారం హను రాఘవకూడి తన తదుపరి చిత్రాన్ని అఖిల్‌తో చేయబోతున్నట్లు తెలిసింది. హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ ఈ సినిమా చేయడానికి సుముఖతను వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వినూత్న ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించనున్నట్లు సమాచారం.

అందాలరాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు హను రాఘవపూడి. సున్నితమైన ప్రేమకథలకు భావోద్వేగాలను మేళవించి రూపొందించిన ఈ చిత్రాలు దర్శకుడిగా ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

English summary
Actor Akhil Akkineni and Arjun Kapoor are reportedly being considered for the Telugu and Hindi remake of Dulquer Salmaan-starrer latest Malayalam action drama “Kammati Paadam”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu