»   » రాజమౌళి కొడుకుపై అఖిల్ ఫ్యాన్స్ అసంతృప్తి

రాజమౌళి కొడుకుపై అఖిల్ ఫ్యాన్స్ అసంతృప్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అవుతున్న అఖిల్ అక్కినేని తొలి సినిమా ‘అఖిల్'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవలే ఈ చిత్రం ఆడియో సాంగ్స్ కూడా విడుదలయ్యాయి. ఇదే ఆడియో వేడుకలో ట్రైలర్ కూడా విడుదల చేసారు. ట్రైలర్ చూసిన అనంతరం రాజమౌళి కొడుకు కార్తికేయ మీద అసంతృప్తిగా ఉన్నారు అఖిల్ ఫ్యాన్స్.

‘అఖిల్' మూవీ ట్రైలర్ ఎడిట్ చేసింది కార్తికేయ అని తెలుస్తోంది. దీంతో ఆయన పని తీరు బాగోలేదని అఖిల్ అభిమానులు మండి పడుతున్నారు. ట్రైలర్ రాక ముందు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయని, అయితే ట్రైలర్ సినిమాపై ఆసక్తి తగ్గేలా చేస్తోందని అంటున్నారు.


సాధారణంగా ఏ సినిమా అయినా ట్రైలర్ సూపర్ హిట్టయితేనే.... సినిమాకు ఓపెనింగ్స్ బాగా వస్తాయి. తొలి వారాతంతం ప్రేక్షకులను థియేటర్ వరకు వెళ్లేలా చేయడంలో ట్రైలర్‌దే ముఖ్య పాత్ర. అసలే అఖిల్ తొలి సినిమా. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానుల్లో ఆందోళన కనిపిస్తోంది. యూట్యూబ్ లో కూడా చాలా మంది ఈ ట్రైలర్ కు డిస్ లైక్ కొడుతున్నారు.


Akhil fans unhappy with Karthikeya

‘అఖిల్' చిత్రానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా యువ హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.


ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akhil movie trailer was edited by S.S.Rajamouli son Karthikeya and Akhil fans are totally unhappy with Karthikeya work.
Please Wait while comments are loading...