»   »  ఇదే మొదటిదైతే బాగుండేది : ‘అఖిల్’ కొత్త ట్రైలర్ (వీడియో)

ఇదే మొదటిదైతే బాగుండేది : ‘అఖిల్’ కొత్త ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అఖిల్‌ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అఖిల్' . 'ది పవర్‌ ఆఫ్‌ జువా...' అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం తొలి ట్రైలర్ ని కొద్ది కాలం క్రితం విడుదల చేసారు. కానీ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దాంతో మేకింగ్ వీడియోలు, డంబాష్ లు అంటూ ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఓ కొత్త ట్రైలర్ ని వదిలారు. ఈ ట్రైలర్ ని చూసిన వారంతా ఇదే మొదట వదిలి ఉంటే క్రేజ్ మరింతగా బాగుండేది అంటున్నారు. మీరూ ఈ కొత్త ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 11న రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. సాయేషా సైగల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌, సుధాకర్‌రెడ్డి నిర్మాతలు. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం అయిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ - తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తే, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

అఖిల్ మాట్లాడుతూ.... నేను పరిచయమయ్యే సినిమా ఈ జోనర్‌లోనే వుండాలని అనుకోలేదు. ఇలాంటి కథే చేద్దాం అని కూడా పెట్టుకోలేదు. నాకు పూర్తిస్థాయిలో నమ్మకాన్ని కలిగించే కథతోనే చెయ్యాలనుకున్నాను. అదే సమయంలో నాలో నమ్మకాన్ని కలిగించే దర్శకుడయితే మరీ మంచిదనుకున్నాను.

ఇలా చేయాలి..అలా చేయాలని ఎవరితో నేను చెప్పలేను కాబట్టి నా ఇంటెన్సిటీని అర్థం చేసుకుని నాకు సపోర్ట్‌గా నిలిచే దర్శకుడు కావాలని కోరుకున్నాను. కథపై నమ్మకం కుదిరిన తరువాత వినాయక్‌గారిచ్చిన సపోర్ట్‌తో ముందడుగు వేశాను. ఇప్పటి వరకు చాలా తెలుగు సినిమాలు చూశాను. ఈ మధ్య కాలంలో ఇలాంటి స్క్రిప్ట్‌తో ఏ సినిమా రాలేదు అని అన్నారు.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
New trailer of the Akhil’s debut film was launched today all over the social networking sites.
Please Wait while comments are loading...