For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'అఖిల్‌' :అఫీషియల్ రిలీజ్ పోస్టర్ ఇదిగో

  By Surya
  |

  హైదరాబాద్‌: అక్కినేని అఖిల్‌ హీరోగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అఖిల్‌' చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్‌ 22న విడుదల కానుంది. ఈ విషయాన్ని అఖిల్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి తెలిపారు. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

  చిత్రం విశేషాలకు వెళితే....

  రీసెంట్ గా మొన్న ఆదివారం నాడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా 'అఖిల్' ఆడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికాలోని అభిమానులు కోసం డాలస్‌ నగరంలో ఈ నెల 26న అక్కినేని అఖిల్‌ మొదటి చిత్రం అఖిల్‌ ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నట్లు అమెరికాలోని ఎన్నారైలు తెలిపారు.

  డాలస్‌లోని అలెన్‌ పర్ఫామింగ్‌ ఆర్ట్స్‌ థియేటర్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో అక్కినేని అఖిల్‌తోపాటు చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్‌, నటి అయేషా సెహగల్‌, సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్స్‌ కూడా హాజరు కానున్నాట్లు వారు వెల్లడించారు. డాలస్‌ తెలుగు అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

  అక్కినేని అఖిల్‌ను హీరోగా వెండి తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'అఖిల్‌'. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు నితిన్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలను ఈ నెల 20న విడుదల చేసారు . ఈ సందర్బంగా ఈ చిత్రం ధియోటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

  ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌, థమన్‌ సంయుక్తంగా ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

  అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ ''ప్రేక్షకుల్ని ఎలా సంతృప్తిపరచాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటా. నా సినిమా పాటల విడుదల వేడుక గురించి ఒక చిన్న మాట చెప్పాలని మహేష్‌ని అడిగా. వేడుకకి నేనే వస్తా అన్నారు. చాలా సంతోషమనిపించింది. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఒక గొప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తా అని చెప్పా. ఆ మాట నిజం చేయబోతున్నా.

  akil-1

  వినాయక్‌గారు ఇదివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అనూప్‌, తమన్‌లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నయ్య, నేను బయట పెద్దగా మాట్లాడుకోం. కానీ నా గురించి వేదికలపై చాలా బాగా చెబుతుంటాడు. ఆ మాటల్ని చాలా ఇష్టపడుతుంటా'' అన్నారు.

  వి.వి.వినాయక్‌ చెబుతూ ''ఒక సూపర్‌హిట్‌ సినిమా ఇస్తానని నాగార్జునగారికి మాటిచ్చా. ఆ మాటని నిలబెట్టుకోబోతున్నాం. సినిమా తీసినవాడిగా నేను చెబుతున్నా అఖిల్‌ తప్పకుండా సూపర్‌స్టార్‌ అవుతాడ''న్నారు.

  యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

  akil2

  శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

  English summary
  Akhil Akkineni released his latest movie release date poster on FB.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X