»   »  ‘అఖిల్’ మూవీ శాటిలైట్ రైట్స్... మరీ అంత తక్కువా?

‘అఖిల్’ మూవీ శాటిలైట్ రైట్స్... మరీ అంత తక్కువా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు ఆయన నటిస్తున్న ‘అఖిల్' సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉండేవి. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు కావడం, నితిన్ నిర్మాత కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. విడుదలకు ముందు జెమినీ టీవీ వారు ఈ సినిమాకు రూ. 7 కోట్లు ఆఫర్ చేసారు. అయితే నిర్మాతలు ఆ మొత్తానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. 8 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు.

అయితే ‘అఖిల్' సినిమా విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. సినిమా ఫస్ట్ డే ప్లాప్ టాక్ రావడంతో నిర్మాతలు నితిన్, సుధాకర్ రెడ్డి తీవ్రమైన నష్టాల పాలయ్యారు. సినిమా ప్లాప్ ప్రభావం శాటిలైట్ రైట్స్ మీద కూడా పడిందట. అపుడు ఏడు కోట్లు ఆఫర్ చేసిన జెమిని టీవీ వారు సినిమాను కొనడానికే ఇష్టపడటం లేదు.


Akhil movie satellite rights down!

కనీసం రూ. 2 కోట్లైనా ఇవ్వాలని నిర్మాత అడిగారట. అంత ఇవ్వలేమని, రూ. 70 లక్షల కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వబోమని తేల్చి చెప్పారట టీవీ ఛానల్ వారు. ముందు జెమినీ టీవీ వారు సినిమాను రూ. 7 కోట్లు కొంటానని వచ్చినపుడే అమ్మి ఉంటే నిర్మాతలకు ఎంతో కొంత ఊరట కలిగేది. అప్పుడు ‘అఖిల్' పొంగు చూసి పొంగిపోయిన నిర్మాతలు ఇపుడు చాలా బాధ పడుతున్నారట.


శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Before release Gemini came up with 7 crores offer for Akhil, but the makers held it back demanding 8 crores. Now the makers are pleading Gemini to take it for at least 2 crores. Shockingly, the TV channel is not willing to up a single paisa over 70 lakhs for the film.
Please Wait while comments are loading...