»   » అఖిల్ న్యూ మూవీ సరికొత్త రికార్డ్..... హైదరాబాద్ లో ఇదే తొలిసారి!

అఖిల్ న్యూ మూవీ సరికొత్త రికార్డ్..... హైదరాబాద్ లో ఇదే తొలిసారి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ అక్కినేని ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్స్, ట్రైన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకించారు.

హైదరాబాద్ మెట్రలో షూటింగ్ జరుపుకున్న తొలి మూవీ ఇదే. షూటింగుకు పర్మిషన్ ఇచ్చి, సినిమా షూటింగ్ కి సహకరించిన మెట్రో మేనేజ్మెంట్ కి ఈ సందర్భంగా అఖిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తూ హైదరాబాద్ నగరాన్ని చూస్తే మరింత అందంగా కనిపిస్తోందని అఖిల్ తెలిపారు.

బాబ్ బ్రౌన్

యాక్షన్ ఎంటర్టెనర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్ సమక్షంలో సీన్స్ చిత్రీకరించారు. బాబ్ బ్రౌన్ తో కలిసి దిగిన ఫోటోను అఖిల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.

మేఘ ఆకాష్

ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. హీరోయిన్ గా మేఘా ఆకాశ్ నటించనుందని సమాచారం. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

నాగార్జున

నాగార్జున

" 'మనం' టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందని నాగార్జున నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ " అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో 'మనం' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మళ్ళీ అదే బ్యానర్ లో ఒక మంచి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అఖిల్ కి ఇది ఒక డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం అవుతుంది " అన్నారు

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : పి.ఎస్. వినోద్, ఆర్ట్ : రాజీవన్ , ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాత : అక్కినేని నాగార్జున, రచన, దర్శకత్వం : విక్రమ్ కె కుమార్.

English summary
"First unit to successfully shoot at the metro. Thank you to the management for being so cooperative. Beautiful to see this in Hyderabad." Akhil tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu