»   » అఖిల్ అక్కినేని సస్పెన్స్ ట్వీట్ ..... ఇంతకీ వీడెవడు?

అఖిల్ అక్కినేని సస్పెన్స్ ట్వీట్ ..... ఇంతకీ వీడెవడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని తాజాగా చేసిన ఓ ట్వీట్ అందరినీ సస్పెన్స్ లోకి నెట్టేసింది. వీడెవడు? అంటూ ఓ పోస్టర్ ను అఖిల్ షేర్ చేసారు. అయితే అందులో హీరో మొహం కనిపించడం లేదు. వీడెవడో తెలియాలంటే ఫిబ్రవరి 14 వరకు ఆగాల్సిందే... ఈ లోగా వీడెవడో కనుక్కోడి చూద్దాం... అంటూ కొన్ని హింట్స్ ఇచ్చాడు అఖిల్.

అయితే అఖిల్ షేర్ చేసిన 'వీడెవడు?' పోస్టర్లో ఉన్నది మరెవరో కాదు... హీరో నితిన్ అని తెలుస్తోంది. నా టీమ్ మేట్ అంటూ అఖిల్ క్లూ ఇచ్చాడు. ఇంతకు ముందు అఖిల్ తన తొలిసినిమాకు పని చేసింది నితిన్ తో మాత్రమే.

మనం ఊహించింది నిజమే అయితే

‘వీడెవడు' విషయంలో మనం ఊహించింది నిజమే అయితే....హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో నిఖిల్ పాతబస్తీకి చెందిన కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు.

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ గత సినిమాలకు భిన్నంగా గడ్డంతో న్యూ లుక్ తో కనిపించబోతున్నారు. ఇప్పటికే బయటకు లీకైన ఫోటోలకు మంచి స్పందన వస్తోంది.

అర్జున్

అర్జున్

హైదరాబాద్ తో పాటు అమెరికాలో ఈ సినిమాను ఎక్కువగా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నారు. స్టైలీష్ విలన్ గా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు.

ఫిబ్రవరి 14

ఫిబ్రవరి 14

ఆ పోస్టర్లో ఉన్నది నితినే అని అందరూ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ...... అఖిల్ ట్వీట్ చేసిన ‘వీడెవడు' ట్వీట్లో సస్పెన్స్ వీడి, అసలు విషయం తెలియాలంటే ఫిబ్రవరి 14న వరకు ఆగాల్సిందే.

English summary
Akhil Akkineni tweeted the pre-first look of an upcoming movie Veedevadu where the protagonists face is not revealed. "Veedevadu?? Take a guess who ?? Hint: He's my team mate..... wishing my buddy all the very best! Rock on Releasing this summer - April 2017" Akhil tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu