»   » అఖిల్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్

అఖిల్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ నుండి త్వరలో యువ కెరటం అఖిల్ అక్కినేని హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం టైటిల్ కూడా ‘అఖిల్'. యువ హీరో నితిన్ నిర్మాత గా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కాబోతోంది.

అయితే అఖిల్ తో పాటు, ఆయన అభిమానులను ఓ సెంమెంట్ వెంటాడుతోంది. టాలీవుడ్ సినిమాల చరిత్రలో హీరో రియల్ పేరుతో వచ్చిన సినిమాలు హిట్టయిన దాఖలాలు లేవు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ తొలి నాళ్లలో ‘చిరంజీవి' అనే సినిమా తీయగా అది బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

అఖిల్ తండ్రి నాగార్జున కూడా కెరీర్ మొదట్లో ‘కెప్టెన్ నాగార్జున్' పేరుతో సినిమా తీసారు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. ఆ మధ్య మంచు విష్ణు కూడా తన పేరుతోనే ‘విష్ణు' అనే సినిమా చేయగా అదో పెద్ద ప్లాపయింది. బ్రహ్మానందం పేరుతో వచ్చిన సినిమా కూడా ఆడలేదు.

ఈ నేపథ్యంలో అఖిల్ పేరుతో వస్తున్న సినిమా ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది? సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా? లేక మరేదైనా జరుగబోతోందా? అనే సందేహాలు అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. మరి సినిమా విడుదలైతేగానీ ఈ విషయమై ఓ క్లారిటీ రావడం కష్టం.

Akhil's movie sentiment haunting

అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Now that Akhil's movie is titled AKHIL, there is a bad name sentiment haunting Nag. His film in 1986, Captain Nagarjuna turned out a dud at the box office.
Please Wait while comments are loading...