Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మరో గుడ్ న్యూస్ చెప్పిన అఖిల్.. ఇదంతా మీ వల్లే అంటూ ఎమోషనల్
బిగ్ బాస్ షో ద్వారా అకిల్ సార్థక్ ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అంతకు ముందు బుల్లితెరపై విలన్ వేషాలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. కొన్ని చిత్రాల్లో అఖిల్ సైడ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. కానీ అప్పుడు అతన్ని ఎవ్వరూ గుర్తించలేదు. కానీ ఒక్కసారి బిగ్ బాస్ షో అనేది అఖిల్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పేసింది. బిగ్ బాస్ ఇంట్లోకి ఎటు వంటి అంచనాలు లేకుండా వచ్చి చివరి వరకు నిల్చున్నాడు.
తడిసిన అందాలతో కనువిందు కలిగిస్తున్న మేఘా గుప్తా

వచ్చినప్పుడే ఫిక్స్..
బిగ్ బాస్ ఇంట్లోకి అఖిల్ అడుగుపెట్టే ముందే చెప్పేశాడు. తాను టాప్ 2లో కచ్చితంగా ఉంటాను అని ధీమాగా చెప్పి వచ్చాడు. చివరకు అలానే జరిగింది. బిగ్ బాస్ నాల్గో సీజన్ విన్నర్‌గా అఖిల్ నిలిచాడు. అయితే చివరకు అఖిల్ ఆటలో అరటి పండు, కరివేపాకులా అయ్యాడని కామెంట్లు కూడా వచ్చాయి.

ఖాళీ చేతులతో..
బిగ్ బాస్ విజేతగా నిలిచిన అభిజిత్‌కు ట్రోఫీతో పాటు రూ . 25 లక్షలు వచ్చాయి. రూ. 25 లక్షల ప్రైజ్ మనీని తీసుకుని సోహెల్ ఆట నుంచి తప్పుకున్నాడు. అలా సోహెల్ మూడో స్థానానికి పరిమితమైనా కూడా రూ. 25 లక్షలు వచ్చాయి. కానీ రన్నర్ అయిన అఖిల్‌కు మాత్రం ఏమీ రాలేదు.

ఫుల్ క్రేజ్..
అయితే అఖిల్‌కు కూడా బయట భారీగానే క్రేజ్ దక్కింది. మోనాల్ చుట్టూ తిరిగి బాగానే ఫేమస్ అయ్యాడు. మోనాల్ అఖిల్ ట్రాక్ గురించి చర్చలు జరగని రోజంటూ లేదు. బిగ్ బాస్ షో నడిచినన్ని రోజులు ఆ ట్రాక్ బాగానే హైలెట్ అయింది. అలా అఖిల్ సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఆ మధ్య అలా..
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అఖిల్ ఓ కొత్త కారును కొన్న సంగతి తెలిసిందే. రెడ్ కలర్ హోండా కారును కొన్న సమయంలో కొన్ని కామెంట్లు కూడా చేశాడు. 25 ఏళ్ల లోపు ఓ కారు కొనుక్కోవాలనే కల కన్నాను. అది నెరవేరింది. దీనంతటి కారణం నా ఫ్యామిలీ, నా ఫ్యాన్స్ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

తాజాగా ఇలా..
అయితే తాజాగా ఓ బైక్ కొన్నాడు అఖిల్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్న సందర్భంగా అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఇదంతా మీ (అభిమానులు) ప్రేమ వల్లే.. మీ ఆదరణ, ప్రేమ, మద్దతు ఎప్పుడూ నా మీద ఉంటాయని ఆశిస్తున్నాను అంటూ అఖిల్ ఎమోషనల్ అయ్యాడు.