For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘అఖిల్’ ‌: ఆల్ ది బెస్ట్ అంటూ సినీ ప్రముఖులు (వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: అక్కినేని కుటుంబంలో నటవారసుడిగా.. అఖిల్‌ తెరంగేట్రం చేస్తున్న చిత్రం 'అఖిల్‌'. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ ని ముమ్మరం చేసారు. అందులో భాగంగా ఆల్ ది బెస్ట్ అనే వీడియోని వదిలారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

  అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునల వారసత్వాన్ని అఖిల్‌ ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆకాంక్షించారు. అక్కినేని అఖిల్‌ తెరంగేట్రం చేస్తున్న 'అఖిల్‌' చిత్రం విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు.

  'అఖిల్‌' చిత్రం ఆడియో విడుదల సందర్భంగా బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, కమల్‌ హాసన్‌, సూర్య, వెంకటేశ్‌, ప్రభాస్‌, రానా, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, ప్రియమణి, శ్రుతి హాసన్‌, త్రివిక్రమ్‌ తదితరుల సందేశాలతో రూపొందించిన ప్రత్యేక వీడియోను అఖిల్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా విడుదల చేశారు.

  ఈ వీడియోలో వారు అఖిల్‌తోపాటు దర్శకుడు వి.వి.వినాయక్‌, నిర్మాత నితిన్‌లకు అభినందనలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖుల సందేశాలు అందుకోవడం పట్ల అఖిల్‌ సంతోషం వ్యక్తం చేశారు. వారికి ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

  akhil
  మరో ప్రక్క ఈ చిత్రానికి మరింతగా క్రేజ్ తేవటానికి ఓ పాటను ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ పాటలో నాగార్జున, నాగచైతన్య కనిపించనున్నారని తెలుస్తోంది.

  నాగార్జున - నాగ చైతన్య కలిసి అఖిల్ సినిమాలో ఓ గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారని సమాచారం. అది కూడా అఖిల్ ఇంట్రడక్షన్ సాంగ్ లో అఖిల్ తో కలిసి కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆ సీన్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ డైరక్షన్ లో ఈ సాంగ్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.


  అగ్నిగోళాన్ని సైతం తన చేతుల్లో ఇముడ్చుకోగల ధీశాలి ఆ కుర్రాడు. భగ భగ మండే సూర్యుడిని తలపించే అతని పయనం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగిందో తెలియాలంటే 'అఖిల్‌' చిత్రాన్ని చూడాల్సిందే. అఖిల్‌ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. 'ది పవర్‌ ఆఫ్‌ జువా...' అనేది ట్యాగ్ లైన్. సాయేషా సైగల్‌ హీరోయిన్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌, సుధాకర్‌రెడ్డి నిర్మాతలు.

  akhil2

  నిర్మాతలు మాట్లాడుతూ...''మాస్‌ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. అఖిల్‌ చేసే యాక్షన్‌ హంగామా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అని చెబుతున్నారు. సంగీతం: తమన్‌, అనూప్‌రూబెన్స్‌

  యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

  శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

  English summary
  Akhil Akkineni tweeted : "I'm more thn privileged & overwhelmed to hve such amazing people say such kind things.I truly m speechless & blessed".
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X