»   » జీవితాన్ని మార్చే ఎక్సపీరియన్స్ : అఖిల్

జీవితాన్ని మార్చే ఎక్సపీరియన్స్ : అఖిల్

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అఖిల్ చిత్రం ద్వారా పరిచయమైన అఖిల్ తాజాగా పెటా కు చెందిన ఓ యాడ్ ని చేసారు. ఆ యాడ్ ద్వారా ఆయన ఓ జంతువును ఎడాప్ట్ చేసుకోమని, అది లైఫ్ ని మార్చే ఎక్సపీరియన్స్ అవుతుందని చెప్తున్నారు. ట్రై చేయమంటున్న ఈ ట్వీట్ ని ఫొటో ని మీరూ చూడండి.


అఖిల్ కెరీర్ విషయానికి వస్తే..

'అఖిల్‌'తో తెరపై తొలిసారి హీరోగా సందడి చేశాడు అఖిల్‌. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర అంతగా ప్రభావం చూపించలేదుగానీ, అఖిల్‌ డాన్సులు బాగున్నాయంటూ కితాబులు అందుకొన్నాడు. ఇప్పుడు రెండో చిత్రం కోసం కసరత్తులు మొదలయ్యాయి.

నాగార్జున అఖిల్‌ కోసం కొత్త కథలు వింటున్నారట. తాజాగా క్రిష్‌కు కబురు అందిందని తెలుస్తోంది. 'అఖిల్‌ కోసం కథ ఉంటే చెప్పండి' అంటూ క్రిష్‌కి ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారట. క్రిష్‌ కూడా అందుకు 'రెడీ' అయినట్టు తెలుస్తోంది.

akhil peta

ఇటీవల క్రిష్‌ నుంచి వచ్చిన 'కంచె' అటు విమర్శకుల ప్రశంసలతో పాటు, బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లను కూడా అందుకొంది. అందుకే నాగ్‌ దృష్టి ఆయననే పడిందేమో. మరోవైపు పూరి జగన్నాథ్‌, శ్రీనువైట్ల, దేవాకట్టాల పేర్లు కూడా అఖిల్‌ రెండో సినిమా కోసం పరిశీలనకు వస్తున్నాయి. మరి వీరిలో అఖిల్‌తో జట్టుకట్టేదెవరో తేలాల్సివుంది.

English summary
Akhil Akkineni tweeted: Have you ever adopted love ? Try it !!! It's a life changing experience! #PETA #adoptlove
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu