»   » అఖిల్-వినాయక్ సినిమా సంగతేమైంది?

అఖిల్-వినాయక్ సినిమా సంగతేమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ వినాయక్ దర్శకత్వంలో ఆ మధ్య సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్, సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షురూ కాలేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 9 నుండి పాత బస్తీలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫైట్ సీన్లతో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. వినాయక్ పోకడ చూస్తుంటే అఖిల్‌ను పూర్తి మాస్ హీరోగా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Akhil, VV Vinayak film rolls from Feb 9

అక్కినేని అఖిల్ లాంచింగ్ కోసం అక్కినేని కుటుంబ అభిమానులే కాకుండా తెలుగు సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అందుకే తొలి చిత్రం ప్రయోగాల జోలికి పోకుండా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు. వినాయక్ శైలి యాక్షన్, వినోదం మేళవింపుతో రూపొందనున్న ఈ చిత్రంలో అఖిల్ పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండనుంది.

షూటింగ్ త్వరతిగతిన పూర్తి చేసి వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akhil Akkineni's film in the direction of VV Vinayak will roll its cameras from 9th February in Hyderabad.
Please Wait while comments are loading...