»   » తండ్రి బాటలో తనయుడు: ‘దేశ్ బచావో ’షేర్ చేసిన అకిరా నందన్

తండ్రి బాటలో తనయుడు: ‘దేశ్ బచావో ’షేర్ చేసిన అకిరా నందన్

Posted By: Rajababu
Subscribe to Filmibeat Telugu

ఏపీ ప్రత్యేక హోదా సాధనకు మద్దతు ఇస్తున్న మెగా హీరోలకు పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ కూడా బాసటగా నిలిచాడు. తాజాగా దేశ్ బచావో ఆల్బమ్ కు సంబంధించిన చిత్రాలను అకిరా నందన్ అకౌంట్ లో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. తమిళనాడులో జల్లికట్టు నిరసనలు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమానికి సెగ పుట్టించాయి. ప్రత్యేక హోదా సాధన ఉద్యమం కోసం మంగళవారం జనసేన 'దేశ్ బచావో 'పేరుతో ఆల్బమ్ ను విడుదల చేసింది.

మొత్తం ఆరు పాటలతో కూడిన ఆల్బమ్ లో మంగళవారం నాలుగు పాటలను విడుదల చేస్తామని, ప్రతీ 25 నిమిషాలకోసారి ఒక్కో పాటను విడుదల చేస్తామని పవన్ కల్యాణ్ తన ఫేస్ బుక్ పేజీలో తెలిపారు. ఈ ఆల్బమ్ కు సంబంధించిన చిత్రాలను పవన్ కల్యాణ్ కుమారుడి పేరుతో ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ నిర్వహిస్తున్న అకిరా నందన్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ ఆల్బమ్ కు సంబంధించిన పాటను యూట్యూబ్ ద్వారా వినాలని పేర్కొన్నారు. అకిరా నందన్ పేరుతో ఓ వెబ్ సైట్ ను కూడా నిర్వహిస్తుండటం విశేషం.

Akiran nandan shares Desh Bachao Photos

దేశ్ బచావో ఆల్బమ్ కు సంబంధించిన చిత్రాలను అకిరా నందన్ అకౌంట్ లో షేర్ చేయడం చర్చనీయాంశమైంది.

English summary
Pawan Kalyan son akira nandan shares Desh Bachao details
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu