For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరు, చరణ్ మరీ ఎక్కువ చూపించారు.... సమంత చాలా వైల్డ్: అఖిల్ కామెంట్స్

  By Bojja Kumar
  |

  అక్కినేని అఖిల్‌ నటించిన 'హలో' మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు అఖిల్ కెరీర్లో తొలి హిట్ గా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈ యంగ్ హీరో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. సినిమా షూటింగుకు సంబంధించిన అనుభవాలను, సినిమా విడుదలైన తర్వాత వస్తున్న ప్రశంసల గురించి పంచుకున్నారు.

  రిస్క్ లేదు కాబట్టే అమ్మ అడ్డు చెప్పలేదు

  రిస్క్ లేదు కాబట్టే అమ్మ అడ్డు చెప్పలేదు

  సినిమాలో యాక్షన్ సీన్ల కోసం దాదాపు 60 రోజులు ముందుగానే ట్రైనింగ్‌ తీసుకున్నాను. స్టంట్ మాస్టర్ బాబ్‌ బ్రౌన్‌ 16 మంది సభ్యులతో కలిసి లాస్‌ ఏంజిల్స్‌ నుండి ముందుగానే ఇక్కడకు వచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఎలాంటి రిస్క్ లేకుండా నటించాను. గ్రాఫిక్స్ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ముందుగానే ట్రైనింగ్‌ తీసుకుని చేశాను. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయడానికి 30 రోజుల సమయం పట్టింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టే అమ్మ కూడా ఎలాంటి అడ్డు చెప్పలేదు అని అఖిల్ తెలిపారు.

  హలో మూవీ రివ్యూ, ప్రేక్షకుల స్పందన !
  చిరంజీవి ఐ హేట్ యూ అన్నారు.... మరీ ఎక్కువ చూపించారు

  చిరంజీవి ఐ హేట్ యూ అన్నారు.... మరీ ఎక్కువ చూపించారు

  మెగాస్టార్ చిరంజీవిగారు, చరణ్ చాలా అప్రిషియేషన్ ఇచ్చారు. వాళ్లకు నేనంటే సాఫ్ట్ కార్నర్. మరీ ఎక్కువ ప్రేమ చూపించారు. హలో లాంగ్వేజ్ ప్రకారం చిరంజీవిగారు ఐ హేట్ యూ అన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చే ఏ నటుడినైనా ఆయన బాగా ఎంకరేజ్‌ చేస్తారు. ఆయనకు సినిమాలంటే పిచ్చి. అందుకే నటీనటలనే కాదు, సినిమాలో ఏ డిపార్ట్‌మెంట్‌ వ్యక్తినైనా ఆయన ఎంకరేజ్‌ చేస్తారు.... అని అఖిల్ తెలిపారు.

  చిరంజీవిగారిని ఊరికే పెద్దనాన్న అనలేదు

  చిరంజీవిగారిని ఊరికే పెద్దనాన్న అనలేదు

  చిరంజీవిగారు మొదటి నుండి సపోర్టు చేశారు. నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. ఆయన్ను ఊరికే పెద్దనాన్న అనలేదు. నన్ను అంత బాగా చూసుకుంటారు. నేను అలా ఎవరినీ అనలేదు. ఆయన సపోర్టు ఎప్పుడూ ఉంటుందని తెలుసు. నాకు సపోర్టు ఇచ్చిన ఆయనకు, చరణ్‌కు థాంక్స్.... అని అఖిల్ తెలిపారు.

  సమంత కాంప్లిమెంట్స్ వైల్డ్‌గా ఉంటాయి

  సమంత కాంప్లిమెంట్స్ వైల్డ్‌గా ఉంటాయి

  సమంత కాంప్లిమెంట్స్ ఎప్పుడూ వైల్డ్ గా ఉంటాయి. సినిమా రిలీజ్ తర్వాత కలవలేదు. తను బాంబేలో ఉంది. ఎల్లుండి మేమంతా కలిసి న్యూ ఇయర్ ట్రిప్ కోసం వెళుతున్నాం. నా న్యూ ఇయర్ పార్ట్‌నర్ ఎవరూ లేదురు మా వదినే నా పార్ట్‌నర్. మరి వదిన ఏం ప్లాన్ చేసిందో తెలియదు..... అని అఖిల్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

  కాంపిటీషన్ అని అనుకుంటే ఆ రేసులోకి వెళ్లి పోతాను

  కాంపిటీషన్ అని అనుకుంటే ఆ రేసులోకి వెళ్లి పోతాను

  నేను ఏదైనా కాంపిటీషన్ అని అనుకుంటే ఆ రేసులోకి వెళ్లి పోతాను. కానీ ఫస్ట్ నేనేం చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఏం కావాలో ముందు నేను డిసైడ్ చేసుకోవాలి. కాంపిటీషన్ అనేది నా మైండ్ లో లేదు. అయినా కాంపిటీషన్ ఎందుకు? ఒకే నెలలో రెండు సినిమాలు రిలీజ్ అయినా హెల్తీ కాంపిటీషన్ ఉండాలనేది నా అభిప్రాయం. నేను మా అన్నయ్యతో పోటీ పడాలి లేదా రానాతో పోటీ పడాలి, మరెవరితోనో పోటీ పడాలి అనుకోవడం అనేది వెరీ సిల్లీ వే. అలాంటి ఆలోచనకు దూరంగా ఉంటాను.... అని అఖిల్ తెలిపారు.

  యుఎస్‌లో కలెక్షన్ బావుంది

  యుఎస్‌లో కలెక్షన్ బావుంది

  యుఎస్‌ మార్కెట్‌ తెలుగు సినిమాకు పెరిగింది. అక్కడి వారికి మా సినిమా బాగా నచ్చింది. అందుకే వన్‌ మిలియన్‌ డాలర్‌ కలెక్షన్‌కు దగ్గరగా ఉంది. యుఎస్‌ మార్కెట్‌లో కలెక్షన్స్‌ బావుంటుందని అనుకున్నాను కానీ ఇంత బావుంటుందని అనుకోలేదు... అని అఖిల్ తెలిపారు.

  నాన్నతో మళ్లీ చేయాలని ఉంది

  నాన్నతో మళ్లీ చేయాలని ఉంది

  నాన్నగారు ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి కోణాన్ని పర్యవేక్షించారు. రామ్‌ గోపాల్‌ వర్మగారి సినిమా షూటింగ్‌ను క్యాన్సిల్‌ చేసి మొత్తం టెన్షన్‌ను ఆయనే తీసుకున్నారు. ఆయనతో మళ్లీ వర్క్‌ చేయాలనుకుంటున్నాను... అని అఖిల్ తెలిపారు.

  బాలీవుడ్ ఆలోచన ఇపుడు లేదు

  బాలీవుడ్ ఆలోచన ఇపుడు లేదు

  ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా తెలుగు ఇండస్ట్రీపైనే. ఎందుకంటే నేను తెలుగువాడ్ని. మా అభిమానులు కూడా ఇక్కడి వారే. ఇక్కడొక ఐదారు సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్‌లో సినిమా గురించి ఆలోచిస్తాను.

  జనవరి 10 తర్వాతి సినిమా ప్రకటిస్తాను

  జనవరి 10 తర్వాతి సినిమా ప్రకటిస్తాను

  జనవరి 5న ఒక కథ వింటున్నాను. జనవరి 8న మరో కథ వింటాను. ఈ రెండింటిలో ఏ సినిమా చేస్తాననేది జనవరి 10న అనౌన్స్‌ చేస్తాను. ఏ దర్శకుడికి నేను కమిట్ కాలేదు. జనవరి 10 తర్వాతే ఏ విషయం అనేది ప్రకటిస్తాను అని అఖిల్ తెలిపారు.

  English summary
  Akkineni Akhil interesting comments about about Mega Star Chiranjeevi in Hello movie interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X