»   » ఇంత జరిగినా అక్కినేని అఖిల్ ఏమాత్రం తగ్గట్లేదుగా!

ఇంత జరిగినా అక్కినేని అఖిల్ ఏమాత్రం తగ్గట్లేదుగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని చిన్నోడు అఖిల్ తొలి సినిమా పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పెద్ద ప్లాపుల్లో ఈ సినిమా ఒకటి. ప్లాపవ్వడం సంగతి పక్కన పెడితే సినిమాకు భారీ నష్టాలు రావడానికి బడ్జెట్ ఎక్కువగా ఖర్చు పెట్టడం ప్రధాన కారణం.

త్వరలో అఖిల్ తన రెండో సినిమాకు సిద్ధమవుతున్నాడు. 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాకు టైటిల్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో 'రారండోయ్ వేడుక చూద్దాం' అనే టైటిల్ రిజిస్టర్ కావడంతో ఇది అఖిల్ మూవీ టైటిలే అని అంటున్నారు.

కాగా... తొలి సినిమా పెద్ద ప్లాప్ అయినా, భారీ నష్టాలు మిగిల్చినా అఖిల్ రెండో సినిమా విషయంలో బడ్జెట్ విషయంలో ఏమాత్రం తగ్గక పోవడం ఇపుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.

ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

విక్రమ్ కుమార్ మీద నమ్మకంతో నాగార్జున ఈ సినిమాపై రూ. 40 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారట. అఖిల్ రేంజికి ఇది భారీ బడ్జెట్టే అయినా... అఖిల్ ను లవర్ బాయ్ గా కాకుండా మాస్ హీరో, యాక్షన్ స్టార్ గా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఫైట్ల కోసమే 20 కోట్లు?

ఫైట్ల కోసమే 20 కోట్లు?

ఈ సినిమా యాక్షన్ ఎంటర్టెనర్‌గా ప్లాన్ చేస్తున్నారని, ఫైట్ సీక్వెన్స్ కోసమే దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు టాక్. సినిమా హాలీవుడ్ యాక్షన్ సినిమా తరహాలో ఉంటుందని అంటున్నారు. విక్రమ్ కుమార్ మీద నమ్మకంతో నాగార్జున ఖర్చుకు ఏ మాత్రం వెనకాడటం లేదట.

ఆ జ్ఞాపకాల నుండి బయట పడేందుకు అఖిల్

ఆ జ్ఞాపకాల నుండి బయట పడేందుకు అఖిల్

కాగా.. అఖిల్ పెళ్లి శ్రీయ భూపాల్‌తో రద్దవ్వడంతో ఈ మద్య కాస్త డిస్ట్రబ్డ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ జ్ఞాపకాల నుండి బయట పడేందుకు వెంటనే తన రెండో సినిమా షూటింగులో బిజీ అవ్వాలని అఖిల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

పెళ్లి రద్దు: అఖిల్‌నే తప్పుపడుతున్నారు, చైతు-సమంతకు కొత్త తలనొప్పి!

పెళ్లి రద్దు: అఖిల్‌నే తప్పుపడుతున్నారు, చైతు-సమంతకు కొత్త తలనొప్పి!

నూనూగు మీసాల వయసులోనే ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు అక్కినేని చిన్నోడు అఖిల్. చిన్న వయసులో ఎంత వేగంగా పెళ్లి పీటల వైపు అఖిల్ అడుగులు వేసాడో... అంతే వేగంగా పెళ్లి పీటల వరకు వెళ్లకముందే కాబోయే భార్యతో గొడవ పెట్టుకుని పెళ్లి రద్దు చేసుకున్నాడనే వార్తలు అందరినీ షాకయ్యేలా చేసాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
We all know that second film of Akkineni Akhil in Vikram Kumar direction. Film Nagar reports said that the budget allotted this film is 40 crore. Usually the budget of Vikram Kumar films will be this range. Sometimes the budget exceeds because he takes long time to complete the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu