»   »  త్రివిక్రమ్‌తో సినిమా గురించి అక్కినేని అఖిల్ కామెంట్

త్రివిక్రమ్‌తో సినిమా గురించి అక్కినేని అఖిల్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Akkineni Akhil
హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ రేంజిలో ఉన్న దర్శకుల్లో ఒకరు దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాంటి దర్శకుడితో కలిసి పని చేసే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. నాగార్జున తనయుడు అఖిల్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన నట జీవితాన్ని ప్రారంభించబోతున్నారంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి.

ఆ వార్తలతో అక్కినేని అభిమానులంతా ఎంతో సంబర పడ్డారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అఖిల్ ఎంట్రీ అంటే ఎంతో గ్రాండ్‌గా ఉంటుందని....తొలి సినిమాతోనే అఖిల్ స్టార్ హీరో అవుతాడని ఆశ పడ్డారు. అయితే వారి సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఈ వార్తలపై అఖిల్ స్పందిస్తూ అవన్నీ కేవలం పుకార్లే అని తేల్చి చెప్పారు.

ఈ వార్తలపై అఖిల్ తన సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లో స్పందిస్తూ...'ఇప్పటి వరకు తాను ఏ సినిమాకు కూడా సైన్ చేయలేదు. ఒక్క స్ర్కిప్టు కూడా వినలేదు' అని వెల్లడించారు. త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ...'త్రివిక్రమ్ గారితో కలిసి పని చేయడం అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన దర్శకత్వంలో చేయడం అంటే ఎంతో ప్రత్యేకమైన విషయం. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను' అని అఖిల్ చెప్పుకొచ్చారు.

'అత్తారింటికి దారేది' చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టి నెం.1 స్థానంలో నిలవడంతో త్రివిక్రమ్ ప్రస్తుతం అంతరి కంటే టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు. త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాను అల్లు అర్జున్‌తో చేయబోతున్నారు.

English summary
"Hey guys, couple of rumours going around that I'm going to be working with Trivikrim Garu for my first film. I love his work no doubt but...It isn't true! No movie has been signed and no story has been heard. Just wanted to clear this out. I'm excited to work with him soon though" Akhil Akkineni tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu