»   » అక్కినేని అఖిల్‌తో నాగబాబు కూతురు (ఫోటో)

అక్కినేని అఖిల్‌తో నాగబాబు కూతురు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవడానికి ముందు షార్ట్ ఫిల్మ్స్‌‌లో నటించి...తన యాక్టింగ్ స్కిల్స్ మెరుగు పరుచుకుంటున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ బాబు కూతురు నిహారిక కూడా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన షూటింగులో అఖిల్‌తో నిహారిక(కుడి) ఫోటోలకు ఇలా ఫోజు ఇచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు మంచి పేరొస్తే వీరిద్దరు జంటగా సినిమా తెరకెక్కే అవకాశం ఉందంటున్నారు.

ఇప్పటి వరకు మెగా స్టార్ కుటుంబం నుంచి దాదాపు అరడజనుకు‌పైగా హీరోలు వెండి తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి ఒక్క హీరోయిన్ కూడా వెండి తెరకు పరిచయం కాలేదు. మెగాస్టార్‌కు ఇద్దరు కూతుర్లు ఉన్నప్పటికీ వాళ్లు మొదటి నుంచీ పూర్తిగా సినీ రంగానికి దూరంగానే ఉంటూ వచ్చారు.

తాజాగా తొలిసారిగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోయిన్ చిత్ర సీమకు పరిచయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగ బాబు తనయ నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందట. ఆమె ఆలోచనకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉంది. ఇటీవల నాగబాబు మీడియాతో మాట్లాడుతూ.....నిహారికకు ఇంట్రెస్టు ఉంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసారు.

గతంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ, పవన్ కళ్యాన్ హీరోగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా-అక్కనేని కుటుంబాలకు చెందిన వారు హీరో హీరోయిన్లుగా సినిమా రాబోతుందనే వార్త సర్వత్రా చర్చనీయాంశం అయింది.

English summary
Film Nagar Rumor is that Nagababu’s daughter Niharika as heroine in Nagarjuna’s second son Akkineni Akhil debut film. Here is the exclusive pic of Akkineni Akhil with Konidela Niharika who happens to be the daughter of Mega brother Nagababu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu