»   » అక్కినేని కుటుంబం : మూడు నెలలు మూడు రిలీజ్ లు

అక్కినేని కుటుంబం : మూడు నెలలు మూడు రిలీజ్ లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున కు తొలి నుంచి డిసెంబర్ నెల కలిసి వస్తూ ఉంది. ఆ నెలలో రిలీజైన సినిమాలు మంచి హిట్ ని నమోదు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఈ సారి కూడా తన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా ని కూడా డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ లోగా ఆయన పెద్ద కుమారుడు నాగ చైతన్య చిత్రం సాహసం శ్వాసగా సాగిపో ను నవంబర్ లో విడుదల చేస్తారు. అలాగే అఖిల్ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేస్తారు. వరసగా అక్కినేని కుటుంబ చిత్రాలు వస్తాయన్నమాట.

ఇక మనం చిత్రంతో కథల ఎంపికలో తన పంథాను నాగార్జున మార్చుకున్న సంగతి తెలిసిందే. వైవిధ్యంతో కూడిన కథాంశాలకే ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా.. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Akkineni Family: Three Months ...three Films

రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరోయిన్స్. వినూత్న కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తాతమనవడిగా ద్విపాత్రాభినయంలో నటించనున్నట్లు సమాచారం. రెండు పాత్రలు సరికొత్త పంథాలో సాగుతాయని చిత్రబృందం చెబుతోంది.

వినోదం, కుటుంబ అనుబంధాల సమాహారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రీసెంట్ గా ప్రారంభమైంది. హీరో,హీరోయిన్స్ లతో పాటు చిత్ర తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. హంసానందిని, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

బ్రహ్మానందం, హంసానందిని, చలపతిరావు, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో హాట్ హీరోయిన్ హంసా నందిని నటిస్తుంది. కొన్ని రోజులు షూటింగులో కూడా పాల్గొంది. తన పాత్ర వివరాలు వెల్లడించలేనని, నేను గతంలో నటించిన పాత్రల కంటే భిన్నమైన పాత్ర అని హంసా తెలిపింది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే అంగీకరించిందట.

లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్' తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.

English summary
Since Akhil movie is getting released in October and Naga Chaitanya is also coming up with Saashasam Swasaga Sagipo in November, Nagarjuna has decided to release his Soggade Chinni Nayana movie in the month of December.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu