For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్: ఆ హీరోతో కలిసి నాగార్జున ప్లాన్.. అప్పుడే రివీల్ చేస్తామంటూ ప్రకటన

  |

  తెలుగులో మల్టీస్టారర్ మూవీ శకం నడుస్తోంది. అంతలా గతంలో ఎన్నడూ లేని విధంగా అలాంటి సినిమాలు వస్తున్నాయి. సీనియర్ హీరోలు ఇలాంటి చిత్రాలు చేయడానికి ముందుకు రాకపోయినా.. ఇప్పటి స్టార్లు మాత్రం మరొకరితో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ కారణంగానే అలాంటి సినిమాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో చిత్రాలు పట్టాలపై ఉండగా.. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో మల్టీస్టారర్ మూవీని ప్రకటించాడు కింగ్ అక్కినేని నాగార్జున. అ సంగతులేంటో చూద్దాం పదండి!

  ‘వైల్డ్ డాగ్'లా మారి వచ్చిన నాగార్జున

  ‘వైల్డ్ డాగ్'లా మారి వచ్చిన నాగార్జున

  వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న నాగార్జున.. ఇటవల ‘వైల్డ్ డాగ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు సోలోమన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఇందులో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా తదితరులు నటించారు. థమన్ సంగీతం సమకూర్చాడు.

  అక్కడ నో రెస్పాన్స్.. అందులో మాత్రం

  అక్కడ నో రెస్పాన్స్.. అందులో మాత్రం

  ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘వైల్డ్ డాగ్' మూవీకి మంచి టాక్ వచ్చింది. కానీ, ప్రతికూల పరిస్థితుల కారణంగా రెస్పాన్స్ మాత్రం అంతగా రాలేదు. దీంతో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా వచ్చాయి. ఫలితంగా బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం ఇది ఫ్లాప్‌గా మిగిలిపోయింది. అయితే, ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ఇది విడుదలవగా.. అక్కడ భారీ స్పందన వచ్చింది. తద్వారా ట్రెండింగ్‌లో నిలిచింది.

  మరో సినిమాను కూడా ప్రారంభించాడు

  మరో సినిమాను కూడా ప్రారంభించాడు

  ‘వైల్డ్ డాగ్' విడుదల సమయంలోనే అక్కినేని నాగార్జున మరో సినిమాను ప్రారంభించాడు. ‘గుంటూరు టాకీస్', ‘పీఎస్వీ గరుడవేగ' ఫేం ప్రవీణ్ సత్తారు దీన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్.

  డ్రీమ్ ప్రాజెక్టుపై మాత్రం క్లారిటీ రాలేదు

  డ్రీమ్ ప్రాజెక్టుపై మాత్రం క్లారిటీ రాలేదు

  ‘సోగ్గాడే చిన్ని నాయన' వంటి భారీ హిట్ చిత్రం తర్వాత దీనికి ప్రీక్వెల్ రూపొందించాలని నాగార్జున.. దర్శకుడు కల్యాణ్ కృష్ణ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ‘బంగార్రాజు' పేరిట స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టారు. ఇది మొదలై చాలా కాలమే అవుతోన్న.. ఇప్పటి వరకూ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ, ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్లలో ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తామని నాగ్ ప్రకటించారు.

  మరో మల్టీస్టారర్ మూవీని ప్రకటించాడు

  మరో మల్టీస్టారర్ మూవీని ప్రకటించాడు

  అక్కినేని నాగార్జున ఇప్పటికే చాలా మల్టీస్టారర్ మూవీలలో నటించాడు. ఈ మధ్య కాలంలో కార్తీతో కలిసి ‘ఊపిరి', నానితో కలిసి ‘దేవ దాస్' అనే సినిమాలు చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన మరో మల్టీస్టారర్‌ను చేయబోతున్నట్లు తాజాగా జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించాడు. ఇందులో అక్కినేని అఖిల్ నటించబోతున్నట్లు తెలిపాడు.

  Seeti Maar From Radhe Released - Allu Arjun Reacts | Filmibeat Telugu
  అప్పుడే రివీల్ చేస్తామంటూ ప్రకటన

  అప్పుడే రివీల్ చేస్తామంటూ ప్రకటన

  ‘వైల్డ్ డాగ్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నాగ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల్‌తో చేయబోయే మల్టీస్టారర్ గురించి ప్రకటించారు. ‘అఖిల్‌తో మల్టీస్టారర్ చేస్తున్నా. కోవిడ్ వల్ల దాన్ని ప్రకటించలేదు. త్వరలోనే అధికారికంగా చెబుతాం' అని వెల్లడించారు. కాగా, అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్' అనే సినిమా చేస్తున్నాడు.

  English summary
  Akkineni Nagarjuna is an Indian film actor, producer, television presenter, and entrepreneur, who primarily works in Telugu-language films. He has also worked in some Hindi and Tamil language films. He has received nine state Nandi Awards, three Filmfare Awards South and two National Film Awards namely.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X