»   »  ఆ ట్రైలర్ నచ్చలేదు, ఓంకార్ ఏడిపించాడు, అప్పటి వరకు డబ్బింగ్ చెప్పను: నాగార్జున

ఆ ట్రైలర్ నచ్చలేదు, ఓంకార్ ఏడిపించాడు, అప్పటి వరకు డబ్బింగ్ చెప్పను: నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున త్వరలో 'రాజు గారి గది 2' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఏఎన్ఆర్ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ముందు నుండీ ఈ సినిమాపై కొన్ని అపోహలు ఉన్నాయి. ఇందులో నాగార్జున గెస్ట్ రోల్ చేస్తున్నారని, పూర్తి సినిమా ఆయన కనిపించరనే వాదన కూడా ఉంది. దీంతో పాటు ఆ మధ్య ఓంకార్ మీద కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఓంకార్ సరిగా తీయక పోవడంతో నాగార్జున మళ్లీ వాటిని రీ షూట్ చేయించారని, దర్శకుడి పని తీరుపై నాగ్ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరిగింది. నాగార్జున మాట్లాడిన తర్వాత ఈ రూమర్లపై క్లారిటీ వచ్చింది.


ముందు ట్రైలర్ బాగోలేదు

ముందు ట్రైలర్ బాగోలేదు

రాజుగారి గది 2 సినిమాకు టెక్నీషియన్స్ అంతా బాగా పని చేశారు. దీనికి ముందు ఓ ట్రైలర్ వచ్చింది. అస్సలు బాగోలేదు. వెంటనే ఓంకార్ కు ఫోన్ చేశాను. ఆయన నాకు వన్ డే టైమ్ ఇవ్వమని అడిగారు. తర్వాత చాలా బాగా ట్రైలర్ కట్ చేశారు.... అని నాగార్జున తెలిపారు.


ఇది నా సినిమా, గెస్ట్ రోల్ కాదు

ఇది నా సినిమా, గెస్ట్ రోల్ కాదు

నాకు ఈ ఫిల్మ్ న్యూ జోనర్. ఈ సినిమా చేసినంత సేపు ఎగ్జైట్మెంట్ ఉంది. చాలా మందికి నేను సినిమాలో కొంత సమయం మాత్రమే ఉంటాననే అపోహ ఉంది. కానీ నేను సినిమా మొత్తం ఉంటాను. ఇది నా సినిమా, ఎవరిదో కాదు.... అంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చారు.రియల్ లైఫ్ ఆధారంగా

రియల్ లైఫ్ ఆధారంగా

ఇందులో ఒక మెంటలిస్టు క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్లు నిజంగా ఉన్నాయి. ఒక కేరళ మనిషి జీవితాన్ని ఇన్స్‌స్పిరేషన్ గా నా పాత్ర ఉంటుంది. రియల్‌ లైఫ్‌లో అలాంటివారిని ఇద్దరు, ముగ్గుర్ని కలిశాను. వాళ్ళకి ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్‌ ఉంటాయి. మీ మనసులో వున్నది ఈజీగా కనిపెట్టేస్తారు. నిజంగా చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. మెంటలిస్టు అంటే మాయలు, మ్యాజిక్ చేయడం ఏమీ ఉండదు. ఒక పది ప్రశ్నలు అడిగి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేస్తారు.... అని నాగార్జున అన్నారు.


ఓంకార్ ఏడిపించాడు

ఓంకార్ ఏడిపించాడు

షూటింగ్ అంతా స‌ర‌దాగా సాగింది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా అని ఉండేది. అప్పుడ‌ప్పుడూ ఓంకార్ న‌న్ను ఏడిపించాడు. అది మిన‌హాయిస్తే.. అంతా స‌వ్యంగా సాగింది. నేనేం ఓంకార్‌మీద కంప్లైంట్ చేయ‌డం లేదు. ఎవ‌రేం చేసినా సినిమా బాగా రావ‌డం కోస‌మే... అని నాగార్జున అన్నారు.


విజువల్ ఎఫెక్ట్స్ బాగోలేకుంటే డబ్బింగ్ చెప్పను అని చెప్పా

విజువల్ ఎఫెక్ట్స్ బాగోలేకుంటే డబ్బింగ్ చెప్పను అని చెప్పా

నేను ముందే చెప్పాను... విజువల్ ఎఫెక్ట్స్ చూడనిదే డబ్బింగ్ చెప్పను అని, లేదంటే మీరు(మీడియా) రేపు విజువల్ ఎఫెక్ట్ష్ బ్యాడ్ గా ఉన్నాయని అంటారు. విజువల్ ఎఫెక్ట్స్ బాగా వస్తేనే డబ్బింగ్ చెబుతాను. దాని కోసం వెయిట్ చేస్తున్నాను... అని నాగార్జున తెలిపారు.


నాగ్ మాటల వెనక అర్థం ఏమిటి?

నాగ్ మాటల వెనక అర్థం ఏమిటి?

‘ఓంకార్ నన్ను ఏడిపించాడు' అని నాగార్జున వ్యాఖ్యానించడం వెనక రకరకాల వాదన వినిపిస్తోంది. ఆ మధ్య రాజుగారి గది 2 షూటింగ్ జరుగుతున్న తీరుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారని, ఓంకార్ షూట్ చేసిన సీన్ల తీరు నచ్చక మళ్లీ రీ షూట్ చేయించారని.... ఆ సంఘటనలను ఉద్దేశించే నాగార్జున ఇలా అన్నారని చర్చించుకుంటున్నారు.


టీమ్ మీద నమ్మకం లేకనే

టీమ్ మీద నమ్మకం లేకనే

‘రాజుగారి గది 2' సినిమా షూటింగ్ సమయంలోనే దర్శకుడు అండ్ ఇతర టీం పని తీరుపై నాగార్జునకు డౌట్ మొదలైనట్లు తెలుస్తోంది. వీళ్లను ఇలాగే వదిలేస్తే రేపు ఏదో నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్ పెట్టేసి తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తారని ఆయన ఫీలవుతున్నట్లు స్పష్టం అవుతోంది. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ బావుంటనే డబ్బింగ్ చెబుతాను, లేకుంటే చెప్పను అని నాగార్జున మీడియా ముఖంగా వెల్లడించినట్లు చర్చించుకుంటున్నారు.English summary
Speaking at the Raju Gari Gadhi 2 trailer launch Nagarjuna made interesting comments. He said that he will not dub his voice for the film unless the team completes VFX works satisfactorily. He said that he made it clear to the director and producer that he will watch the visual effects part..and if he is satisfied then only he will dub the voice.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu